HomeTop StoriesCensus : బీజేపీ బీసీల బద్ధ శత్రువు.. కులగణనపై కపట నాటకం: పొన్నం ప్రభాకర్

Census : బీజేపీ బీసీల బద్ధ శత్రువు.. కులగణనపై కపట నాటకం: పొన్నం ప్రభాకర్

Ponnam Prabhakar slams BJP on BC caste census : బీజేపీ పూర్తిగా ‘బీసీల ద్రోహుల పార్టీ’ అని మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీసీ కులగణన చేపడతామని ప్రగల్భాలు పలికిన బీజేపీ, నేటికీ ఆ హామీని నెరవేర్చకుండా పక్కనపెట్టడం పచ్చి మోసమని మండిపడ్డారు. బీసీ వర్గానికి చెందిన నేతను రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి అకస్మాత్తుగా తప్పించిన పార్టీకి, బీసీల హక్కుల గురించి మాట్లాడే కనీస నైతికత ఎక్కడుందని నిలదీశారు.

- Advertisement -

కేవలం ఎన్నికల లబ్ధి, రాజకీయ ప్రయోజనాల కోసమే కులగణన అంశాన్ని బీజేపీ వాడుకుంటోందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు సముచిత న్యాయం చేసేందుకు చిత్తశుద్ధితో అడుగులు వేస్తుంటే, బీజేపీ మాత్రం కుట్రపూరిత రాజకీయాలు చేస్తోందని ఆయన స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News