HomeTop StoriesPonnam Prabhakar: పల్లె పల్లెకు పొన్నం అన్న.. ప్రజల చెంతకే ప్రజా పాలన

Ponnam Prabhakar: పల్లె పల్లెకు పొన్నం అన్న.. ప్రజల చెంతకే ప్రజా పాలన

సిద్దిపేట, (తెలుగుప్రభ): ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకునే లక్ష్యంతో సిద్దిపేట జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ చేపడుతున్న “పల్లె పల్లెకు పొన్నం అన్న–పల్లె పల్లెలో ప్రజా పాలన” కార్యక్రమం ఈ నెల 6వ తేదీ నుంచి హుస్నాబాద్ నియోజకవర్గంలో కొనసాగనుంది. ఇందులో భాగంగా మంత్రి ఆయా గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి ప్రజలతో నేరుగా సమావేశమై వారి సమస్యలను తెలుసుకోనున్నారు.

- Advertisement -

కోహెడ మండలంలో తొలి రోజు పర్యటన..

అక్టోబర్ 6న సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటన సాగనుంది. ఉదయం 9 గంటలకు పరివేద, 10.30 గంటలకు నకిరేకొమ్ముల, మధ్యాహ్నం 12 గంటలకు శ్రీరాములపల్లి, 2.30 గంటలకు సీసీ పల్లి, సాయంత్రం 4 గంటలకు కాచాపూర్, 5 గంటలకు మైసంపల్లి గ్రామాల్లో పర్యటించనున్నారు.

చిగురుమామిడిలో రెండో రోజు..

అక్టోబర్ 7న కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలో పర్యటన ఉంటుంది. ఉదయం 9 గంటలకు ముదిమాణిక్యం, 11 గంటలకు రామంచ, మధ్యాహ్నం 12.30 గంటలకు ముల్కనూర్, 3 గంటలకు పీచుపల్లి, సాయంత్రం 4 గంటలకు సీతారాంపూర్ గ్రామాల్లో మంత్రి ప్రజలను కలవనున్నారు.

సైదాపూర్ మండలంలో మూడో రోజు..

అక్టోబర్ 8న సైదాపూర్ మండలంలో పర్యటన కొనసాగుతుంది. ఉదయం 9 గంటలకు రాయికల్ తండా, 10.30 గంటలకు రాయికల్, మధ్యాహ్నం 12.30 గంటలకు బొమ్మకల్, 3 గంటలకు అమ్మనగుర్తి, సాయంత్రం 4.30 గంటలకు గుండ్లపల్లి గ్రామాల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించనున్నారు.
గ్రామాల్లో పర్యటించే సందర్భంగా ప్రజల నుంచి నేరుగా సమస్యలను స్వీకరించి, స్థానికంగా ఉన్న సమస్యలు, అభివృద్ధి అవసరాలను తెలుసుకోనున్నారు. ప్రజా పాలనను క్షేత్రస్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మంత్రి కార్యాలయం వెల్లడించింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News