Saturday, November 15, 2025
HomeTop StoriesPost Office Scheme: మీ జీవిత భాగస్వామిపై పోస్టాఫీస్‌లో లక్ష ఎఫ్‌డీ చేశారా?.. రెండేళ్లలో ఎంతొస్తుందో...

Post Office Scheme: మీ జీవిత భాగస్వామిపై పోస్టాఫీస్‌లో లక్ష ఎఫ్‌డీ చేశారా?.. రెండేళ్లలో ఎంతొస్తుందో తెలిస్తే షాకవుతారు

- Advertisement -

Post Office Scheme on Fixed deposits: రెగ్యులర్ పెట్టుబడులు దీర్ఘకాలంలో మంచి రాబడిని ఇస్తాయి. ప్రస్తుతం మార్కెట్లో చాలా పెట్టుబడి మార్గాలు ఉన్నప్పటికీ వాటిలో కొన్ని నష్టాలు అందిస్తాయి. దీర్ఘకాలిక పెట్టుబడులే సురక్షితంగా ఎక్కువ రాబడిని అందిస్తాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వ పథకాలు, బాండ్లు, బ్యాంక్ డిపాజిట్ పథకాలు మొదలైన పెట్టుబడులు హామీ మేరకు మంచి రాబడిని అందిస్తాయి. ఇందులో రిస్క్‌ చాలా తక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. బ్యాంకు డిపాజిట్ స్కీమ్‌ల విషయానికి వస్తే.. మనకు ముందుగా గుర్తుకొచ్చేది ఫిక్స్‌డ్ డిపాజిట్లే. ప్రస్తుతం బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాలపై చాలా మంచి వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. సీనియర్ సిటిజన్లకు సాధారణ ప్రజల కంటే ఎక్కువ వడ్డీరేట్లను అందిస్తాయి. మీరు సురక్షితమైన, ఎక్కువ రాబడిని కోరుకుంటే మీ కుటుంబంలోని వృద్ధుడి పేరు మీద ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయడం బెస్ట్‌ ఆప్షన్‌గా చెప్పవచ్చు.

బ్యాంకులను మించి అధిక వడ్డీ..

ప్రస్తుతం, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను అత్యంత ప్రజాదరణ గల పెట్టుబడి మార్గంగా భావిస్తున్నారు. అందువల్ల, ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు బ్యాంకు నుండి బ్యాంకుకు మారుతూ ఉంటాయి. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను కేవలం బ్యాంకులే కాకుండా పోస్టాఫీసుల్లో కూడా చేయవచ్చు. ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును తగ్గించినందున, దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకులు తమ ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను తగ్గించాయి. అయితే, పోస్టాఫీసులు మాత్రం ఎఫ్డీ వడ్డీ రేట్లను తగ్గించలేదు. మునుపటిలాగే ఎఫ్డీలపై అధిక వడ్డీని ఆఫర్చేస్తోంది. రెపో రేటు తగ్గింపు పోస్టాఫీసు ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేటుపై ఎటువంటి ప్రభావాన్ని చూపలేదు. ఈ పరిస్థితిలో ఒక వ్యక్తి తన భార్య పేరు మీద రూ.1 లక్ష ఎఫ్డీ చేస్తే 24 నెలల తర్వాత ఎంత డబ్బు వస్తుందో ఇప్పుడు చూద్దాం.

సురక్షితమైన పెట్టుబడి మార్గం..

పోస్టాఫీసులో 1 నుండి 5 సంవత్సరాల కాలానికి ఎఫ్డీ చేయడాన్ని టైమ్ డిపాజిట్లు అని కూడా పిలుస్తారు. బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ల మాదిరిగానే, టర్మ్డిపాజిట్లు ఒక నిర్దిష్ట కాలానికి సురక్షితమైన స్థిర ఆదాయాన్ని అందిస్తాయి. పోస్టాఫీసు తన కస్టమర్లకు ఏడాది, రెండేళ్లు, మూడేళ్లు, ఐదేళ్లకు టర్మ్డిపాజిట్ఖాతాలను తెరిచే అవకాశాన్ని అందిస్తుంది. పోస్టాఫీసు ఏడాది కాలానికి టర్మ్డిపాజిట్లపై 6.9 శాతం, 2 సంవత్సరాల టీడీలపై 7.0 శాతం, 3 సంవత్సరాల టీడీలపై 7.1 శాతం, 5 సంవత్సరాల టీడీలపై 7.5 శాతం వడ్డీ రేట్లను అందిస్తుంది. పోస్టాఫీసు టీడీ ఖాతాలో కనీస డిపాజిట్ రూ.1,000 మెయింటెన్చేయాలి. దీనికి గరిష్ట పరిమితి లేదు. ఒకవేళ, మీరు మీ జీవిత భాగస్వామిపై లక్ష రూపాయిలు డిపాజిట్ చేస్తే రెండేళ్ల మెచ్యూరిటీ తర్వాత మీకు మొత్తం రూ.1,14,888 లభిస్తుంది. ఇందులో రూ.14,888 వడ్డీగా వస్తుంది. ఈ స్కీమ్కింద గ్యారెంటీ రిటర్న్ఆర్జించవచ్చు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad