HomeTop StoriesProddatur: సీఎం, డిప్యూటీ సీఎం పర్యటన... ట్రాఫిక్ మళ్లింపు

Proddatur: సీఎం, డిప్యూటీ సీఎం పర్యటన… ట్రాఫిక్ మళ్లింపు

ప్రొద్దుటూరు,(తెలుగు ప్రభ):ప్రొద్దుటూరు పట్టణంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటన సందర్భంగా పట్టణంలో ట్రాఫిక్ అంతరాయం కలగకుండా వివిధ దారుల ద్వారా మళ్లిస్తున్నట్లు ఏఎస్పీ విభూకృష్ణ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన ఆదివారం జమ్మలమడుగు బైపాస్‌ రోడ్డులోని సభా ప్రాంగణాన్ని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.

- Advertisement -

సోమవారం ఉదయం 7 గంటల నుంచి కడప, మైదుకూరు వైపు నుంచి జమ్మలమడుగు వెళ్లే వాహనాలను ప్రొద్దుటూరు హనుమాన్‌ జంక్షన్‌, వాసవీ సర్కిల్‌, వైఎస్సార్‌ సర్కిల్‌ (చౌటపల్లి) మీదుగా మళ్లించనున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా జమ్మలమడుగు నుంచి కడప, మైదుకూరు వైపు వచ్చే వాహనాలు వైఎస్సార్‌ సర్కిల్‌, వాసవీ సర్కిల్‌, హనుమాన్‌ జంక్షన్‌ మీదుగా వెళ్లాలని సూచించారు.

సభకు వచ్చే వాహనాల కోసం బొల్లవరం మున్సిపల్‌ ప్లాట్లలో ప్రత్యేక పార్కింగ్‌ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పోలీసు, రెవెన్యూ, ఎన్‌హెచ్‌ఏఐ, పంచాయతీ శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. భద్రతా విధుల కోసం కర్నూలు రేంజ్‌తో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన సిబ్బందితో కలిపి సుమారు 2,000 మంది పోలీసులు విధుల్లో ఉన్నారని ఏఎస్పీ తెలిపారు. ప్రజలు ట్రాఫిక్‌ మళ్లింపులను గమనించి పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News