HomeTop StoriesYadagirigutta: సీఎం పర్యటనలో ప్రోటోకాల్ లోపం.. 15 నిమిషాలు చాపర్‌లోనే వేచి ఉన్న రేవంత్‌ రెడ్డి

Yadagirigutta: సీఎం పర్యటనలో ప్రోటోకాల్ లోపం.. 15 నిమిషాలు చాపర్‌లోనే వేచి ఉన్న రేవంత్‌ రెడ్డి

Protocol issue: సీఎం రేవంత్‌ రెడ్డి యాదాద్రి పర్యటనలో జిల్లా యంత్రాంగం, ప్రోటోకాల్ అధికారుల సమన్వయ లోపం స్పష్టంగా కొట్టొచ్చినట్లు కనిపించింది. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన సీఎం, మంత్రుల హెలికాప్టర్ పెద్దగుట్టపై ల్యాండ్ అయినప్పటికీ.. అక్కడ వారిని రిసీవ్ చేసుకోవడానికి కనీసం ఒక్క జిల్లా ఉన్నతాధికారి కూడా అందుబాటులో లేకపోవడం తీవ్ర కలకలం రేపింది.

- Advertisement -

15 నిముషాలు చాపర్‌లోనే వేచి ఉన్న సీఎం: వేద పాఠశాల శంకుస్థాపన ప్రాంగణమైన పెద్ద గుట్టపై సీఎం హెలికాప్టర్ ల్యాండ్ అయ్యింది. అయితే అధికారుల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్, సమన్వయ రాహిత్యం కారణంగా ముఖ్యమంత్రికి స్వాగతం పలికేందుకు స్థానిక కలెక్టర్ గానీ, ఎస్పీ గానీ, ఇతర ప్రోటోకాల్ అధికారులు గానీ సమయానికి చేరుకోలేకపోయారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డితో పాటు తోటి మంత్రులు ఏకంగా 15 నిమిషాల పాటు చాపర్‌లోనే వేచి ఉండాల్సి వచ్చింది. వీఐపీ పర్యటనలో స్థానిక యంత్రాంగం ఇంతటి నిర్లక్ష్యం ప్రదర్శించడంపై సచివాలయ వర్గాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అత్యంత ప్రతిష్టాత్మకమైన సీఎం పర్యటనలో జిల్లా కలెక్టరేట్, పోలీస్ యంత్రాంగం వైఫల్యంపై ఉన్నతాధికారులు నివేదిక కోరినట్లు సమాచారం. ఈ నిర్లక్ష్యానికి కారణమైన బాధ్యులపై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Also read-TSTDC: భక్తులకు గుడ్ న్యూస్.. సరస్వతి అంత్య పుష్కరాలకు ప్రత్యేక ప్యాకేజీ!

రూ.99.55 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన: అధికారుల సమన్వయ లోపాన్ని పక్కనబెడితే.. సీఎం రేవంత్ రేడ్డి యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పాఠశాల నిర్మాణంతో పాటు మొత్తం రూ.99.55 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు ఆలయ అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారు.

శంకుస్థాపనల వివరాలు:

  • రూ.43.80 కోట్లతో వేద పాఠశాలకు శంకుస్థాపన
  • రూ.9.87 కోట్లతో కొండపై స్వామివారి నిత్య కల్యాణ మండపం నిర్మాణం.
  • రూ.1.41 కోట్లతో వైకుంఠ ద్వారం నుంచి కొండపైకి వెళ్లే మెట్ల మార్గానికి పై కప్పు నిర్మాణానికి శంకుస్థాపన
  • రూ.1.35 కోట్లతో రథశాల వైపు మాడవీధులకు మెట్ల నిర్మాణానికి శంకుస్థాపన
  • రూ.43.12 కోట్లతో డార్మిటరీ హాల్స్, దీక్షాపరుల సదనం నిర్మాణానికి శంకుస్థాపన.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News