HomeTop StoriesMantralayam: ఓటు హక్కు వినియోగించుకున్న శ్రీమఠం పీఠాధిపతి

Mantralayam: ఓటు హక్కు వినియోగించుకున్న శ్రీమఠం పీఠాధిపతి

మంత్రాలయం, తెలుగు ప్రభ ఇంటర్నెట్ న్యూస్ : రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థులు మంత్రాలయంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మండల కేంద్రమైన మంత్రాలయంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గురువారం జరుగుతున్న ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికలలో భాగంగా రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థులు మధ్యాహ్నం 12:30 గంటలకు ఎన్నికల కేంద్రానికి చేరుకున్నారు.

- Advertisement -

సీఐ గిరిబాబు గుణశేఖర్, ఎస్సై మల్లికార్జునరావు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికల కేంద్రానికి ఏర్పాటు చేరుకున్న పీఠాధిపతిలో తన ఓటు హక్కును వినియోగించుకుని ఎంపీటీసీ జడ్పిటిసి ఎన్నికలలో ఓటు వేశారు.

రాజ్యాంగం కల్పించిన వజ్రాయుధం ఓటు..

అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన వజ్రాయుధం ఓటు హక్కు అని ఒక్క ఓటుతోనే మార్పు తీసుకురాగలమని పీఠాధిపతి సూచించారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకుని తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని పీఠాధిపతి ఓటర్లకు సూచించారు. ఈ కార్యక్రమంలో శ్రీమఠం ధార్మిక అధికారి శ్రీపతి ఆచార్, సహాయ మేనేజర్ ఐపీ నరసింహామూర్తి, వేద పాఠశాల మాజీ ప్రిన్సిపల్ వాధిరాజాచార్ తదితరులు పాల్గొన్నారు.

Also Read:Siddipet: సీనియర్ జర్నలిస్ట్ సత్యనారాయణ రెడ్డికి ఆర్టీఐ కమిషనర్ పరామర్శ

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News