Chhatron Ki Goonj student protests : లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సోషల్ మీడియా వేదికగా మహారాష్ట్ర విద్యార్థుల ఆందోళనపై తీవ్రంగా స్పందించారు. పేపర్ లీకులు, స్తంభించిపోయిన నియామకాలు, విపరీతంగా పెరిగిన విద్యా ఖర్చులు, హాస్టళ్లలో నాసిరకం వసతులు విద్యార్థుల జీవితాలను బలితీసుకుంటున్నాయని మండిపడ్డారు. ముఖ్యంగా ఎంపీఎస్‌సీ (MPSC) లాంటి రాజ్యాంగ బద్ధ సంస్థల విశ్వసనీయతను దెబ్బతీస్తూ యువత ఆశలపై నీళ్లు చల్లుతున్నారని ఆరోపించారు.
నిరుద్యోగం – నియామకాల నిలిపివేత: ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో తీవ్రమైన జాప్యం జరగడం.ప్రతీ పరీక్షా విధానం అస్తవ్యస్తంగా మారి విద్యార్థుల శ్రమ బూడిదలో పోసిన పన్నీరు కావడం. రాజ్యాంగ సంస్థలను రాజకీయ జోక్యంతో భ్రష్టు పట్టించడం వల్ల విద్యార్థుల్లో పెరిగిన అభద్రతా భావం. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి విద్యార్థుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకపోతే, ఈ నిరసనల గొంతుక మరింత ఉధృతమై ‘ఛత్రోం కీ గూంజ్’ రూపంలో దేశాన్ని కుదిపేస్తుందని రాహుల్ గాంధీ హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో యువత గొంతును అణచివేయలేరని ఈ ఉద్యమం మరోసారి నిరూపిస్తోంది.

