HomeTop StoriesViral Video: హైదరాబాద్‌లో అమానుషం.. మహిళ జుట్టు పట్టుకొని ఈడ్చుకెళ్లిన పోలీస్

Viral Video: హైదరాబాద్‌లో అమానుషం.. మహిళ జుట్టు పట్టుకొని ఈడ్చుకెళ్లిన పోలీస్

Hyderabad: హైదరాబాద్‌లో అమానుష ఘటన చోటుచేసుకుంది. ఖాకీ దుస్తుల్లో ఉన్న ఓ వ్యక్తి చేసిన అరాచకం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఓ మహిళపై రైల్వే కానిస్టేబుల్ అత్యంత అమానుషంగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది.

- Advertisement -

మహిళ జుట్టు పట్టుకొని ఈడ్చుకెళ్లిన పోలీస్: హైదరాబాదులోని హఫీజ్‌పేట్ రైల్వే స్టేషన్ సమీపంలో ఈ దారుణ జరిగింది. ఓ మహిళపై రైల్వే పోలీస్ కానిస్టేబుల్ విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. ఆమెను అందరి సమక్షంలోనే కొట్టడమే కాకుండా జుట్టు పట్టుకొని నేలపై ఈడ్చుకెళ్లాడు. ఈ దారుణ దృశ్యాలు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. దీంతో పోలీసుల తీరుపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రక్షణ కల్పించాల్సిన పోలీసులే ఇలా మహిళలపై దాడులకు పాల్పడటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఈ దాడికి అసలు కారణాలు ఏమిటనే దానిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సంబంధిత అధికారులు ఈ ఘటనపై స్పందించి తగిన చర్యలు తీసుకుంటారని ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News