Rain forecast: ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో నేడు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) వెల్లడించింది. శ్రీకాకుళం, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, నెల్లూరు, తిరుపతి జిల్లాలతో పాటు అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పోలవరం ప్రాంతంలో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది.
ఈదురుగాలులతో కూడిన వర్షాలు: అలాగే ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని తెలిపింది. వర్షాల సమయంలో పిడుగులు పడే ప్రమాదం ఉందని పేర్కొంది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అత్యవసర సహాయం లేదా సమాచారం కోసం అధికారిక పోర్టల్స్ ద్వారా వివరాలు తెలుసుకోవాలని అధికారులు తెలిపారు.

