HomeTop StoriesCrime: తల్లిని చంపి ముంబై డాన్ అవ్వాలనుకున్నాడు.. రాజాం హత్య కేసులో సంచలన విషయాలు!

Crime: తల్లిని చంపి ముంబై డాన్ అవ్వాలనుకున్నాడు.. రాజాం హత్య కేసులో సంచలన విషయాలు!

Rajam murder case: “చెడు స్నేహాలు వద్దు.. బుద్ధిగా చదువుకో బిడ్డా” అని చెప్పిన కన్నతల్లిని ఓ మైనర్ కుమారుడు దారుణంగా హత్యచేశాడు. మిత్రుడితో కలిసి తల్లిని అతికిరాతకంగా నరికి చంపాడు. ఈ ఘటన విజయనగరం జిల్లా రాజాంలో చోటుచేసుకుంది. ఈ నెల 4న జరిగిన హత్య కేసు వివరాలను చీపురుపల్లి డీఎస్పీ ఎస్‌.రాఘవులు శుక్రవారం మీడియాకు వెల్లడించారు.

- Advertisement -

ప్రేమలేఖ వివాదమే కారణం: పోలీసుల కథనం ప్రకారం.. రాజాంకు చెందిన ముంజేటి సతీశ్‌, స్పందన (34) దంపతులకు 16 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. ఇటీవలే పదో తరగతి పూర్తి చేసిన సదరు బాలుడు.. పాఠశాలలో ఒక అమ్మాయికి ప్రేమలేఖ రాశాడు. ఈ విషయం తెలిసిన స్కూలు యాజమాన్యం తల్లిదండ్రులకు ఫిర్యాదు చేశారు. దీంతో తల్లి స్పందన కుమారుడిని మందలించింది. “చెడు స్నేహాలు వద్దు.. బుద్ధిగా చదువుకో బిడ్డా” రోజూ చెబుతూ ఉండేది. దీంతో విసుగుచెందిన కుమారుడు తల్లిపై కక్ష పెంచుకున్నాడు.

Also read-Kukatpally: మహిళా కానిస్టేబుల్‌పై ఎస్సై లైంగిక దాడి.. నిలదీస్తే ఎదురుదాడి!

తల్లిని చంపి ముంబై డాన్ అవ్వాలనుకున్నాడు: ఈ క్రమంలోనే నిందితుడికి క్రికెట్ గ్రౌండ్‌లో మరో 17 ఏళ్ల బాలుడితో పరిచయం ఏర్పడింది. ఆ మిత్రుడు సైతం కుటుంబ సమస్యలతో రగిలిపోతూ.. “మా అమ్మను నిర్లక్ష్యం చేసిన మా నాన్నను, ఆయనతో ఉండే మహిళను అడ్డుతొలగించుకుందాం.. ఆపై ఇద్దరం ముంబై వెళ్లి పెద్ద డాన్లుగా ఎదుగుదాం” అంటూ నూరిపోశాడు. ఈ క్రమంలోనే ఇద్దరూ కలిసి మొదటగా స్పందనను హతమార్చడానికి స్కెచ్ వేశారు.

ఆకలేస్తోందని పిలిపించి.. హత్య చేశాడు!: ఈ నెల 4న ఉదయం స్పందన.. పక్క వీధిలో ఉన్న పుట్టింటికి వెళ్లగా.. కుమారుడు తన స్నేహితుడిని కత్తితో ఇంటికి పిలిపించుకున్నాడు. ఇంట్లోని బీరువా తెరిచి 9.5 తులాల బంగారంతో పాటు రూ.5 వేల నగదును బ్యాగులో సర్దుకున్నారు. అనంతరం అమ్మమ్మకు ఫోన్ చేసి “ఆకలేస్తోంది.. అమ్మను త్వరగా ఇంటికి పంపించు” అని నమ్మబలికాడు. దీంతో ఇంటికి వచ్చిన స్పందన కాళ్లు కడుక్కోవడానికి స్నానాల గదిలోకి వెళ్లగానే.. అక్కడ కాపుకాసిన కుమారుడి స్నేహితుడు ఆమె పీక పట్టుకున్నాడు. ఇద్దరూ కలిసి కత్తితో ఆమె శరీరంపై ఏకంగా 16 సార్లు పొడిచి కిరాతకంగా చంపేశారు. అనంతరం శవాన్ని చీరతో చుట్టి.. సమీపంలోని కోనేరులో పడేశారు.

Also read-Kakinada: కాకినాడలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు స్పాట్‌ డెడ్‌!

చిలకపాలెం వద్ద అరెస్ట్: స్పందన మృతదేహం లభ్యమయ్యాక పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. అయితే ఇంట్లో కుమారుడు కనిపించకపోవడంతో పోలీసులకు అనుమానం వచ్చి ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు. హత్య అనంతరం నిందితులిద్దరూ రైలెక్కి భువనేశ్వర్, ముంబై, తిరుపతి, విశాఖపట్నం అంతా తిరిగారు. చివరకు పలాసకు వెళ్లే క్రమంలో చిలకపాలెం వద్ద పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి దొంగిలించిన సొత్తును స్వాధీనం చేసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News