HomeTop StoriesContraversy : గురువుల కాళ్లకు మొక్కి క్షమాపణ చెప్పాల్సిందే: ఎమ్మెల్యే కవ్వంపల్లికి రసమయి హెచ్చరిక

Contraversy : గురువుల కాళ్లకు మొక్కి క్షమాపణ చెప్పాల్సిందే: ఎమ్మెల్యే కవ్వంపల్లికి రసమయి హెచ్చరిక

తిమ్మాపూర్  (తెలుగు ప్రభ): ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందిని ఉన్నత స్థాయికి తీర్చిదిద్ది తమ భవిష్యత్తుకు పునాది వేసిన పవిత్రమైన టీచర్ల రోజునే అవమానపరంగా మాట్లాడిన ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ బుద్ధిలేని మూర్ఖుడని టీచరు లేకుంటే నీవు డాక్టర్ ఎలా అయ్యావని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ప్రశ్నించారు. శనివారం మహాత్మ నగర్ లో గల అరుంధతి ఫంక్షన్ హాల్ లో స్మార్ట్ కార్డులను పంపిణీ చేసిన కార్యక్రమంలో టీచర్లను కించపరిచే విధంగా మాట్లాడిన మాటలపై రసమయి ఫైర్ అయ్యారు ఒకరికొకరు మాటలతో తారస్థాయికి చేరాయి.

- Advertisement -

తిమ్మాపూర్ మండల కేంద్రంలోని రాష్ట్ర నాయకులు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో గోసి గొంగడితో యావత్ తెలంగాణ రాష్ట్రాన్ని కదిరించిన ఘనత తనదేనని అంతకుముందు తాను టీచర్ ఉద్యోగం చేశానని ఆ వృత్తి పట్ల నువ్వో.. బోడి టీచర్.. వి అని కించపరచడం ఉపాధ్యాయ వృత్తికే కళంకనీయమన్నారు.

గతంలో తాను టీచర్ గా చేసిన రసమయి అంటే అసలు ఏమనుకుంటున్నావు నా గురించి తెలుసుకొని మాట్లాడు ఖబర్దార్ నీలా 20 సంవత్సరాలు ప్రజల కాళ్లు మొక్కితే ఎమ్మెల్యే గా ఒకసారి ప్రజలు నీకు అవకాశం ఇచ్చారని.. ఆ మాత్రానికే.. నీకు అంత అహంకారం పనికిరాదని తెలంగాణ ఉద్యమంలో ప్రజలే తనకు 2 పర్యాయాలు అవకాశం కల్పించిన ఘనత తనకే దక్కుతుందన్నారు.

తెలంగాణ ఉద్యమంలో కవ్వంపల్లి సత్యనారాయణ చంద్రబాబు మోచేతి నీళ్లు తాగుతున్న క్రమంలో టీచరుగా ఉద్యమకారునిగా సంస్కృతిక సారథిగా ఎంతోమందిని దిశా నిర్దేశం చేసిన టీచర్ అని చెప్పుకొచ్చారు. కవ్వంపల్లి పుట్టక ముందు నుంచే తాను దూరదర్శన్ లో జానపద పాటలు చేశానని తాను ఎమ్మెల్యే కాకముందు 2 కోట్లు పెట్టి సినిమా తీసిన నా చరిత్ర నీకు తెలుసా అంటూ ప్రశ్నించారు. కవ్వంపల్లి తల్లిదండ్రులు కష్టపడి డాక్టర్ గా తీర్చిదిద్దితే కనీసం తల్లిదండ్రులకు అన్నం పెట్టని కొడుకుగా నీవు నా చారిత్ర గురించి మాట్లాడతావా అంటూ ఘాటుగా విమర్శించారు.

గుండ్లపల్లి మాజీ సర్పంచ్ భర్త చనిపోతే అన్ని విధాలుగా ఆదుకుంటానని చెప్పి ఇప్పటివరకు వారి ఇంటి వైపు వెళ్లకపోవడం చెప్పుతో కొట్టమంటావా అని నీకు నువ్వే ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు. ఎవరు ప్రశ్నించిన ఆత్మహత్యలు చేసుకునేలా వారిపై ప్రతాపం చూపించడమే నీ పని అని ఎవరే మాట్లాడిన వారిపై కేసులు పెట్టించడం నీ నైజం అని..ఇక మానకొండూరు నియోజకవర్గంలోని నీ శకం ముగిసిందని ఇప్పటికైనా మనిషిగా మారాలని సూచించారు.

మానకొండూర్ నియోజకవర్గంలో 20 ఎకరాలు ఎలా వచ్చాయని పచ్చునూర్ గ్రామంలో ఫామ్ హౌస్ ఎలా కడుతున్నామని తనకు పూర్తిగా తెలుసని ఆరోపించారు. కమిషన్లతో బ్రతికే నువ్వు నియోజకవర్గాన్ని పూర్తిగా దోచుకుంటున్నావని ఇక నీ ఆటలు ప్రజలు సాగనివ్వరని తెలిపారు. భావితరాలకు మార్గదర్శమైన గురువులకు కాళ్లపై పడి వెంటనే క్షమాపణ చెప్పాలని లేకపోతే తాము ఊరుకోబోమని హెచ్చరించారు. ఈ సమావేశంలో నాయకులు నాయిని వెంకటరెడ్డి, పాశం అశోక్ రెడ్డి, గంప వెంకన్న, పొన్నం అనిల్ గౌడ్, వంతడుపుల సంపత్, సర్పంచ్ తాట్ల తిరుపతి, ఉప సర్పంచ్ మహేష్, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సదయ్య, మా శెట్టి శివ, అఖిల్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News