Thursday, January 22, 2026
HomeTop StoriesMetaview AI: భారతీయ నిపుణులకు హెచ్1బి కోసం రోజుకు లక్ష డాలర్లైనా కడతాం.. ఏఐ కంపెనీ...

Metaview AI: భారతీయ నిపుణులకు హెచ్1బి కోసం రోజుకు లక్ష డాలర్లైనా కడతాం.. ఏఐ కంపెనీ సీఈవో కామెంట్స్

Shahriar Tajbakhsh: భారతదేశంలోని అత్యంత ప్రతిభావంతులైన టెక్ ఉద్యోగులకు అమెరికన్ H-1B వీసా ఇవ్వడంపై ఇటీవల అమెరికాలో పెరుగుతున్న వ్యతిరేకతను లండన్ కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ AI సంస్థ మెటా వ్యూ ఏఐ సహ వ్యవస్థాపకుడు షాహ్రియార్తాజ్‌బఖ్ష్ పట్టించుకోలేదు. ఒక అమెరికన్ యూజర్ H-1B వీసా ఫీజును సంవత్సరానికి లక్ష డాలర్లు చేయాలని సూచించగా తాజ్‌బఖ్ష్ దానికి స్పందిస్తూ.. దాన్ని రోజుకు లక్ష డాలర్లు చేయండంటూ బదులిచ్చారు. తాను దాని చెల్లింపులకు ఏర్పాట్లు చేస్తాయని వ్యాఖ్యానించటం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

- Advertisement -

H-1B వీసా స్పాన్సర్‌షిప్‌ను కంపెనీలు భారంగా భావిస్తున్న తరుణంలో.. నైపుణ్యం కలిగిన ఉద్యోగుల విలువకు ముందు ఈ ఫీజు ఎంత అల్పమైందో షాహ్రియార్తాజ్‌బఖ్ష్ బలంగా చెప్పారు. గతవారం H-1B ప్రతిభకు ప్రధాన కేంద్రమైన భారతదేశంలో మెటా వ్యూ AI సంస్థ చేపట్టిన హైరింగ్ ప్రచారం చర్చనీయాంశమైంది. తాము H-1B లను స్పాన్సర్ చేస్తామని ఐఐటీల ముందు పెట్టిన కటౌట్స్ తర్వాత తాజా స్పందన వచ్చింది. AI దానికదే తయారవ్వదని ప్రస్థావించటం ఈ కంపెనీని ప్రత్యేకంగా నిలబెట్టాయి.

also read Telangana Rising Global Summit: తెలంగాణలో రూ. 25 వేల కోట్లతో గ్రీన్‌ డేటా సెంటర్- కరణ్‌ అదానీ

ఇరాన్ మూలాలున్న ఈ టెక్ ఎంట్రప్రెన్యూర్ తాజ్‌బఖ్ష్.. టాలెంట్ విషయంలో ఎలాంటి రాజీ పడకూడదని నొక్కి చెప్పారు. ప్రజల కఠోర శ్రమతో సృష్టించబడిన విలువను లెక్కించినప్పుడు లక్ష డాలర్లు అనే మొత్తం లెక్కలోకి రాదన్నారు. ప్రజల జీవితాలను మార్చే అర్థవంతమైన దేనినైనా నిర్మించాలంటే.. ప్రపంచ స్థాయి టీమ్ తప్పక ఉండాలన్నారు. ప్రతిభావంతుల విషయంలో డబ్బు ఆదా చేయాలనుకోవడం ఒక ఫౌండర్ చేయగలిగే అత్యంత బాధ్యతారహితమైన పని అని అభిప్రాయపడ్డారు. వీసా ఖర్చుల గురించి జరిగే చర్చ ప్రధాన అంశాన్ని పక్కదారి పట్టిస్తుందని అన్నారు. డొనాల్డ్ ట్రంప్ పరిపాలన వీసా నిబంధనలను కఠినతరం చేస్తున్నప్పటికీ.. రాబోయే లాటరీలో మరిన్ని H-1B పిటిషన్లు సమర్పించడానికి మెటా వ్యూ సిద్ధంగా ఉందని తాజ్‌బఖ్ష్ తేల్చి చెప్పేశారు.

“ఒక సంస్థ విజయం లేదా వైఫల్యం దాని సిబ్బందిపై ఆధారపడి ఉంటుంది” అని ఆయన స్పష్టం చేశారు. భారతదేశం నుంచి అత్యుత్తమ టాలెంట్‌ను ఆకర్షించడంలో ఆయనకున్న అభిప్రాయాన్ని తాజా కామెంట్స్ హైలైట్ చేస్తున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News