HomeTop StoriesViral fevers: విజృంభిస్తున్న వైరల్‌ ఫీవర్లు.. చిన్న పిల్లలకు ఫిట్స్‌ వచ్చే ప్రమాదం

Viral fevers: విజృంభిస్తున్న వైరల్‌ ఫీవర్లు.. చిన్న పిల్లలకు ఫిట్స్‌ వచ్చే ప్రమాదం

Viral fevers: రాష్ట్రవ్యాప్తంగా వైరల్‌ జ్వరాలు తీవ్రంగా విజృంభిస్తున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో వైరల్‌ ఫీవర్‌తో వచ్చే బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. దీంతో ఆస్పత్రుల్లో అవుట్‌ పేషెంట్‌ (ఓపీ) కౌంటర్లు రోగులతో కిటకిటలాడుతున్నాయి. గత నాలుగైదు రోజులుగా అన్ని దవాఖానాల్లోనూ ఫీవర్‌ బాధితుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నట్లు వైద్యులు వెల్లడిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో మారుతున్న చల్లటి వాతావరణ పరిస్థితుల కారణంగా వివిధ రకాల వైరస్‌లు ప్రబలుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లోని గాంధీ, ఉస్మానియా, ఫీవర్‌ ఆస్పత్రులకు వస్తున్న ప్రతి 10 ఓపీ కేసుల్లో 9 మంది జ్వర బాధితులే ఉంటున్నట్లు వైద్యులు తెలిపారు. కొన్ని జిల్లాల్లో అయితే జ్వర కేసులు రెట్టింపు స్థాయిలో నమోదవుతున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

ఒళ్లు నొప్పులతో మొదలవుతున్న ఫివర్లు: జ్వరాలు ముఖ్యంగా ఒళ్లు నొప్పులతో ప్రారంభం అవుతున్నట్లు వైద్యులు తెలిపారు. ఎక్కువగా ఎడినో వైరస్‌ కేసులు నమోదవుతున్నట్లు తెలుస్తోంది. దీని బారిన పడితే తీవ్రమైన జ్వరం అధికంగా ఉండనుంది. విపరీతమైన విరేచనాలు, ఒళ్లు నొప్పులు ఉంటున్నాయి. ఈ జ్వరం తగ్గడానికి కనీసం ఐదారు రోజులు పడుతోంది. కొందరిలో గొంతు నొప్పి, ఫ్లూ లక్షణాలు కూడా కనిపిస్తున్నాయి. శ్వాసకోశ సంబంధిత సమస్యలతో పాటు బాడీపెయిన్స్‌, తలనొప్పితో కూడిన సమస్యలు ఎదురవుతున్నాయి. వైరల్‌ జ్వరాలతో పాటు కొన్ని ప్రాంతాల్లో డెంగీ కేసులు కూడా నమోదవుతున్నట్లు వైద్యులు తెలిపారు.

Also Read-Nagarjuna Sagar: నేడు సాగర్‌లో మహా వరుణ యాగం.. కుటుంబ సమేతంగా హాజరుకానున్న సీఎం

చిన్న పిల్లలకు ఫిట్స్‌ వచ్చే ప్రమాదం: వైరల్‌ ఫీవర్‌ కేసులు ఎక్కువగా పాఠశాల విద్యార్థుల్లో కనిపిస్తున్నాయి. పిల్లల ద్వారా ఇళ్లలోని మిగతా కుటుంబ సభ్యులకు జ్వరాలు సోకుతున్నాయి. చిన్న పిల్లల్లో జ్వర తీవ్రత అధికంగా ఉంటే ఫిట్స్‌ వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పిల్లల బాడీ ఎక్కువగా వేడి అయితే గోరువెచ్చని నీటిలో కూడిన తడిగుడ్డతో బాడీని తుడుస్తూ ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. వైరల్‌ ఫీవర్ల బారిన పడిన వారు త్వరగా కోలుకోవడానికి ఎక్కువగా విశ్రాంతి తీసుకోవాలని తెలిపారు. అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News