HomeTop StoriesMinister Lokesh: ఏపీకి రాయల్ ఎంట్రీ.. బుల్లెట్ రైడ్‌తో హింట్ ఇచ్చిన మంత్రి నారా లోకేశ్!

Minister Lokesh: ఏపీకి రాయల్ ఎంట్రీ.. బుల్లెట్ రైడ్‌తో హింట్ ఇచ్చిన మంత్రి నారా లోకేశ్!

Royal Enfield plant: ఏపీకి భారీ పెట్టుబడులే లక్ష్యంగా దూసుకుపోతున్న ఐటీ మంత్రి నారా లోకేశ్.. తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్ట్ హాట్ టాపిక్‌గా మారింది. “ఏపీకి ఎవరు వస్తున్నారో తెలుసా..?” అనే ఆసక్తికరమైన క్యాప్షన్‌తో లోకేశ్ వీడియోను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతుంది.

- Advertisement -

బుల్లెట్ రైడ్‌తో హింట్ ఇచ్చిన లోకేశ్: ఈ వీడియోలో మంత్రి లోకేశ్ స్టైలిష్ లుక్‌లో రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌ను నడుపుతూ కనిపించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆయన చేసిన ఈ బుల్లెట్ రైడ్‌ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. కేవలం బైక్ రైడ్ మాత్రమే కాకుండా.. ఈ పోస్ట్ ద్వారా ఒక పెద్ద పారిశ్రామిక శుభవార్తను ఆయన పరోక్షంగా చెప్పకనే చెప్పారు.

Also read-Andhra Pradesh: ఏపీ సర్కార్‌ కీలక నిర్ణయం.. ఏనుగులకు ఆధార్!

రూ. 2,500 కోట్లతో మెగా ప్లాంట్?: మంత్రి లోకేశ్ హింట్ ఇచ్చినట్లుగానే.. ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield) ఏపీలో తన తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయబోతున్నట్లు తెలుస్తోంది. దాదాపు రూ. 2,500 కోట్లతో ఈ మెగా ప్లాంట్ ఏర్పాటు కానుందని కూటమి నేతలు తెలిపారు. తిరుపతి జిల్లాలోని సత్యవేడు ప్రాంతంలో ఈ పరిశ్రమ రాబోతున్నట్లు సమాచారం. ఆ ప్లాంట్‌ ఏర్పాటు అయితే దాదాపు 5వేల మందికి ఉపాధి అవకాశం లభించే అవకాశం ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News