HomeTop StoriesRRB: తాళికి టేపు వేసి పరీక్ష పెట్టారు.. ఎందుకో తెలుసా?

RRB: తాళికి టేపు వేసి పరీక్ష పెట్టారు.. ఎందుకో తెలుసా?

RRB Exams: రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు (RRB) పరీక్ష రాయడానికి వచ్చిన అభ్యర్థులకు చేదు అనుభవం ఎదురైంది. గుంటూరు జిల్లా పేరేచర్ల సమీపంలోని అయాన్‌ డిజిటల్‌ సెంటర్‌లో శుక్రవారం నిర్వహించిన తనిఖీలు వివాదాస్పదంగా మారాయి. నిబంధనల పేరిట అక్కడి సిబ్బంది అభ్యర్థుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది.

- Advertisement -

మనోభావాలు దెబ్బతినేలా తనిఖీలు: పరీక్షా కేంద్రం వద్ద తనిఖీల సమయంలో సిబ్బంది అత్యుత్సాహం ప్రదర్శించారు. వివాహితల మెడలోని మంగళసూత్రాలకు టేపులు వేయగా.. కాలి మెట్టెలతో పాటు చేతి గాజులను బలవంతంగా తీయించేశారు. అక్కడితో ఆగకుండా చెవి కమ్మలు, ముక్కుపుడకలను సైతం అనుమతించలేదు. చివరకు అభ్యర్థులు భక్తితో చేతికి కట్టుకున్న దారాలను సైతం కత్తెరతో తెంచివేయడం అభ్యర్థులను తీవ్ర మనస్తాపానికి గురిచేసింది.

Also read-Tamil Nadu: తమిళనాడు సీఎం పీఠంపై వీడని ఉత్కంఠ.. హైదరాబాద్ చేరుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు!

నిబంధనలు ఏం చెబుతున్నాయి?: వాస్తవానికి ఆర్‌ఆర్‌బీ కాల్‌లెటర్లలోని నిబంధనల ప్రకారం లోహపు వస్తువులు, మంగళసూత్రాలు, గాజులు లేదా మతపరమైన చిహ్నాలు ధరించిన అభ్యర్థుల విషయంలో ఇన్విజిలేటర్లు అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి. అదనపు సిబ్బందితో వారిపై ప్రత్యేక నిఘా ఉంచి పరీక్షకు అనుమతించాల్సి ఉంటుంది. అయితే అదనపు సిబ్బందిని నియమించడం ఇష్టం లేకనో లేదా పర్యవేక్షణ భారం అనుకున్నారో ఏమో కానీ.. నిర్వాహకులు ఏకంగా ఆ వస్తువులనే తొలగించడం గమనార్హం. ఈ ఘటనపై అభ్యర్థుల కుటుంబ సభ్యులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిబంధనల అమలులో మానవత్వం, మతపరమైన విశ్వాసాలను గౌరవించాల్సిన అవసరం ఉందని వారు డిమాండ్ చేస్తున్నారు.

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News