HomeTop StoriesRussia: కుప్పకూలిన విమానం.. 29 మంది మృతి!

Russia: కుప్పకూలిన విమానం.. 29 మంది మృతి!

Military Plane Crash: రష్యాలో విషాదం చోటుచేసుకుంది. సాంకేతిక లోపంతో ఏఎన్‌-26 (An-26) సైనిక రవాణా విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమానంలో ప్రయాణిస్తున్న 29 మంది ప్రాణాలు కోల్పోయారు.

- Advertisement -

క్రిమియా ప్రాంతంలో ప్రమాదం: స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం 6 గంటలకు.. క్రిమియా ప్రాంతంలో ప్రయాణిస్తున్న విమానంతో కంట్రోల్ రూమ్ సంబంధాలు తెగిపోయాయి. ఆ తర్వాత కొద్దిసేపటికే విమానం కుప్పకూలినట్లు అధికారులు గుర్తించారు. మరణించిన వారిలో 23 మంది ప్రయాణికులుకాగా.. ఆరుగురు విమాన సిబ్బంది ఉన్నట్లు రష్యా రక్షణ శాఖ ధృవీకరించింది.

Also read-US vs Iran: బంకర్‌ బస్టర్లతో విరుచుకుపడిన అమెరికా.. దద్దరిల్లిన ఇస్ఫహాన్‌!

సాంకేతిక లోపమే: విమానంపై ఎలాంటి శత్రుదాడులు జరగలేదని ప్రాథమిక విచారణలో తేలింది. కేవలం సాంకేతిక లోపం కారణంగానే ఈ ప్రమాదం సంభవించిందని రక్షణ శాఖ వెల్లడించింది. ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తునకు ఆదేశించినట్లు రష్యా ప్రభుత్వం ప్రకటించింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News