HomeTop StoriesMinister Uttam: 'సన్నబియ్యం పథకానికి ఏడాది పూర్తి.. క్రెడిట్ సీఎం రేవంత్ రెడ్డిదే'

Minister Uttam: ‘సన్నబియ్యం పథకానికి ఏడాది పూర్తి.. క్రెడిట్ సీఎం రేవంత్ రెడ్డిదే’

Sanna Biyyam scheme: ఆహార కల్తీని నియంత్రించడానికి రాష్ట్రంలో ఒక ప్రత్యేక వ్యవస్థను తీసుకొస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈగల్, హైడ్రా తరహాలో ఆహార కల్తీని నియంత్రించడానికి ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తామన్నారు. ఇందుకోసం దేశంలో ప్రస్తుతం అమలవుతున్న కల్తీ నిరోధక చట్టాలను అధ్యయనం చేసి పటిష్టమైన చర్యలు చేపడుతామని తెలిపారు.

- Advertisement -

దొడ్డుబియ్యాన్ని సన్నాలుగా మార్చే మాఫియా: రేషన్ షాపుల ద్వారా దొడ్డుబియ్యం అందించినా తినేవారు లేకపోవడంతో ఆ బియ్యాన్ని సన్నబియ్యంగా మార్చే మాఫియా పెరిగిపోయిందని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. పైగా దొడ్డు బియ్యం ఇవ్వడం వల్ల ప్రభుత్వానికి ఖర్చు తప్ప పేదలకు ఉపయోగపడటం లేదని తెలిపారు. అన్ని రకాలుగా ఆలోచనలు చేసిన తర్వాత పేదలు తినగలిగే సన్నబియ్యం అందించాలని ఈ పథకాన్ని ప్రారంభించినట్లుగా పేర్కొన్నారు.

పంట మార్పిడిపై అవగాహన కల్పిస్తాం: ఇందుకోసమే క్వింటాలుకు 500 రూపాయల బోనస్ ప్రకటించి సన్నవడ్లు పండించాలని రైతులను ప్రోత్సహిస్తున్నామని అన్నారు. అంతేకాకుండా అడిగిన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు జారీ చేశామని తెలిపారు. ఇదే తరహాలో రాష్ట్రంలో విద్యార్థులకు నాణ్యమైన విద్య, పోషకాహారం అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. ఈ క్రమంలో పంట మార్పిడి విధానాలపై రైతుల్లో అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు. వాణిజ్య తరహా పంటల వైపు రైతులను ప్రోత్సహిస్తామని సీఎం రేవంత్‌ రెడ్డి తెలిపారు.

సన్నబియ్యం పథకానికి ఏడాది పూర్తి: రాష్ట్రంలో 3.39 కోట్ల మందికి పంపిణీ చేస్తున్న సన్నబియ్యం పథకం ప్రారంభమై ఏడాది పూర్తయిన సందర్భంగా పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులకు శాసనసభ సెంట్రల్ హాలులో సన్నబియ్యంతో భోజనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సీఎంతో పాటు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొని భోజనం చేశారు.

Also read-Revanth: కేసీఆర్‌ లేకపోతే నేను లేను- సీఎం రేవంత్‌ రెడ్డి

క్రెడిట్ సీఎం రేవంత్ రెడ్డిదే: రాష్ట్రంలో అమలవుతున్న సన్నబియ్యం పథకం ఏడాది పూర్తిచేసుకున్న సందర్భంగా పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పేదలకు నాణ్యమైన ఆహారం అందించాలనే ఈ అద్భుతమైన ఆలోచన సీఎం రేవంత్ రెడ్డిదేనని అన్నారు. ఆ ఘనత పూర్తిగా ఆయనకే దక్కుతుందని తెలిపారు. ప్రభుత్వానికి ఎంత ఆర్థిక భారమైనా సరే పేద ప్రజలు కడుపునిండా భోజనం చేయాలన్నదే సీఎం రేవంత్‌ రెడ్డిఆలోచన అని మంత్రి స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News