School Holidays For Diwali Festival: దసరా సెలవుల్లో ఎంజాయ్ చేసిన విద్యార్థులను మరోసారి సెలవులు పలకరించనున్నాయి. రాబోయే దీపావళి పండుగ సందర్భంగా తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు మరోసారి భారీగా సెలవులు రానున్నాయి. దీంతో, ఈ వార్త విన్న విద్యార్థులు ఎగిరి గంతేస్తున్నారు. దసరా మాదిరిగానే ఇప్పుడు కూడా సూళ్లు, కాలేజీలకు భారీగా సెలవులు ఉండే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ నెల దుర్గాష్టమి, దసరా సెలవులతో ప్రారంభమైంది. ఆ తర్వాత వాల్మీకి జయంతి సందర్భంగా అనేక రాష్ట్రాల్లో సెలవు ప్రకటించారు. ఈ సెలవుల్లో ఫుల్ ఎంజాయ్ చేసిన విద్యార్థులు సోమవారం నుంచి పాఠశాలలకు వెళ్తున్నారు. అయితే, ఈ సెలవులు ముగిసిన కొద్ది రోజులకే మరోసారి సెలవులు రానున్నాయి. దీపావళి సమీపిస్తుండటంతో విద్యార్థులకు మళ్లీ సెలవులు రానున్నాయి. ఈ ఏడాది దీపావళి పండుగకు అనేక రాష్ట్రాల్లోని పాఠశాలలకు ఐదు రోజుల పాటు సెలవులు ప్రకటించారు. ఈ సమయంలో ఆయా రాష్ట్రాల్లోని పాఠశాలలు, కళాశాలలు మూసి ఉండనున్నాయి. దీనివల్ల విద్యార్థులు కుటుంబంతో కలిసి బాణాసంచా కాలుస్తూ కుటుంబ సభ్యుల మద్య ఆనందంగా పండుగ జరుపుకునే అవకాశం లభిస్తుంది.
విద్యార్థులకు మళ్లీ వరుస సెలవులు..
2025 పండుగ క్యాలెండర్ ప్రకారం.. అక్టోబర్ 18న ధన్ తేరాస్ జరుపుకుంటారు. ఆ తర్వాత నరక చతుర్దశి (ఛోటీ దీపావళి), దీపావళి, గోవర్ధన పూజ, భాయ్ దూజ్ వరుసగా జరగనున్నాయి. ఈ ఐదు రోజులు అక్టోబర్ 18 నుండి అక్టోబర్ 23 వరకు విద్యార్థులకు వరుసగా పండుగలు రానున్నాయి. అయితే, అక్టోబర్ 18న రానున్న ధన్‌తేరాస్ ప్రభుత్వ సెలవు దినం కానప్పటికీ, సాధారణంగా నెలలో రెండవ శనివారం కారణంగా పాఠశాలలు మూసి ఉండనున్నాయి. ఇక, అక్టోబర్ 19 నుండి అధికారిక సెలవులు ప్రారంభమవుతాయి. ఆదివారం ఎలాగూ దేశ వ్యాప్తంగా పాఠశాలలకు సెలవు ఉంటుంది కాబట్టి ఆరోజు కూడా పాఠశాలలు మూతపడనున్నాయి. అనంతరం, అక్టోబర్ 20న నరక చతుర్దశి లేదా చోటి దీపావళి సందర్భంగా అనేక రాష్ట్రాల్లో పాఠశాలలకు సెలవు ఉంటుంది. ఇక, దీపావళి పండుగ అక్టోబర్ 21న వస్తుంది. ఇది చాలా రాష్ట్రాల్లో ప్రభుత్వ సెలవుదినంగా అమలు అవుతోంది. అక్టోబర్ 22న గోవర్ధన పూజ, అక్టోబర్ 23న భాయ్ దూజ్ కోసం పాఠశాలలు మూసి ఉంటాయి. అయితే, ఈ సెలవులు రాష్ట్రం లేదా పాఠశాల యాజమాన్యాన్ని బట్టి మారే అవకాశం ఉంది. అన్ని రాష్ట్రాల్లో ఒకేలా సెలవులు ఉండకపోవచ్చు. అయితే, అన్ని రాష్ట్రాల్లో దీపావళి రోజు మాత్రం సెలవు ఉండనుంది. మిగతా రోజుల్లో ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాన్ని బట్టి సెలవులు రానున్నాయి.


