HomeTop StoriesIPL: వైభవ్ సూర్యవంశీ 'A' సింబల్ సెలబ్రేషన్స్ వెనుక సీక్రెట్ ఇదే!

IPL: వైభవ్ సూర్యవంశీ ‘A’ సింబల్ సెలబ్రేషన్స్ వెనుక సీక్రెట్ ఇదే!

Vaibhav Suryavansh: ఐపీఎల్-2026 లో రాజస్థాన్ రాయల్స్ (RR) యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ పరుగుల వరద పారిస్తున్నాడు. మంగళవారం లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ (LSG) తో జరిగిన కీలక పోరులో ఈ కుర్రాడు వీరవిహారం చేశాడు. ప్రత్యర్థి బౌలర్లను ముప్పుతిప్పలు పెడుతూ స్టేడియం నలుమూలలా సిక్సర్లు, ఫోర్ల వర్షం కురిపించాడు.

- Advertisement -

38 బంతుల్లో 93 పరుగులు: మ్యాచ్ ఆరంభంలో కాస్త నెమ్మదిగా ఆడిన వైభవ్.. క్రీజులో సెట్ అయ్యాక ఒక్కసారిగా గేర్ మార్చాడు. కేవలం 23 బంతుల్లోనే మెరుపు అర్ధ శతకాన్ని (50) పూర్తి చేసుకున్నాడు. హాఫ్ సెంచరీ తర్వాత మరింతగా రెచ్చిపోయిన సూర్యవంశీ త్రుటిలో సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. మొత్తం 38 బంతులు ఎదుర్కొన్న వైభవ్ 7 ఫోర్లు, ఏకంగా 10 సిక్స్‌ల సాయంతో 93 పరుగులు చేసి వెనుదిరిగాడు.

Also read-RR vs LSG: ‘వైభవ్’ విజయం.. లక్నోపై రాజస్థాన్‌ ‘రాయల్‌’ పర్ఫామెన్స్‌

ఇంతకీ ఆ ‘A’ సింబల్ రహస్యం ఏంటి?: ఈ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ మార్కును దాటిన తర్వాత వైభవ్ సూర్యవంశీ తన చేతి వేళ్లతో ఇంగ్లీష్ అక్షరం ‘A’ సింబల్ చూపిస్తూ వినూత్నంగా సంబరాలు చేసుకున్నాడు. గత మ్యాచ్‌లోనూ ఇలాంటి సెలబ్రేషన్స్ చేయడంతో.. అసలు ఈ ‘A’ వెనుక ఉన్న మర్మమేంటా అని సోషల్ మీడియాలో అభిమానులు తెగ వెతికారు. అయితే మ్యాచ్ అనంతరం జరిగిన ప్రెజెంటేషన్ కార్యక్రమంలో కామెంటేటర్ మురళీ కార్తిక్ దీనిపై ప్రశ్నించగా.. వైభవ్ ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. “అలా ఎందుకు చేశానో నాకూ తెలియదు (నవ్వుతూ). ప్రతి మ్యాచ్‌లోనూ ఏదో ఒక కొత్తదనాన్ని ప్రయత్నించాలని చూస్తుంటాను. అయితే ఈ ఇన్నింగ్స్‌ను నా తల్లికి అంకితం ఇస్తున్నాను. ఆమె పేరు ‘A’ అక్షరంతో మొదలవుతుంది. అందుకే మైదానంలో ఆ సింబల్ చూపించాను” అని వైభవ్ అసలు సీక్రెట్ వెల్లడించాడు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News