HomeTop StoriesHyderabad: ఉస్మానియాలో ర్యాగింగ్ కలకలం.. 12 మందిపై కేసు నమోదు

Hyderabad: ఉస్మానియాలో ర్యాగింగ్ కలకలం.. 12 మందిపై కేసు నమోదు

Osmania Medical College: హైదరాబాద్‌లోని ప్రముఖ ఉస్మానియా మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం రేపింది. బీడీఎస్ (BDS) మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులను ర్యాగింగ్ చేశారనే ఆరోపణలపై ఫైనల్ ఇయర్‌కు చెందిన 12 మంది విద్యార్థులపై సుల్తాన్‌బజార్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ప్రిన్సిపల్ ఫిర్యాదుతో రంగంలోకి పోలీసులు: కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ సంజీవ్ సింగ్ యాదవ్ ఇచ్చిన అధికారిక ఫిర్యాదు మేరకు సుల్తాన్‌బజార్ పోలీసులు రంగంలోకి దిగారు. బాధ్యులైన 12 మంది ఫైనల్ ఇయర్ విద్యార్థులపై ‘తెలంగాణ ప్రొహిబిషన్ ఆఫ్ ర్యాగింగ్ యాక్ట్’ కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

- Advertisement -

ఆరు నెలల పాటు సస్పెన్షన్: ర్యాగింగ్ ఘటనను తీవ్రంగా పరిగణించిన కాలేజీ యాజమాన్యం ప్రాథమిక చర్యలు చేపట్టింది. నిందితులుగా తేలిన 12 మంది విద్యార్థులను ఆరు నెలల పాటు కాలేజీ నుండి సస్పెండ్ చేస్తూ ప్రిన్సిపల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేసుపై స్పందించిన పోలీసులు.. లోతైన దర్యాప్తు చేస్తున్నట్లు దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. ర్యాగింగ్‌కు పాల్పడిన ఈ 12 మంది విద్యార్థులతో పాటు.. దీని వెనుక ఇంకా ఎవరి హస్తమైనా ఉందా అనే కోణంలోనూ ఆరా తీస్తున్నామని పోలీసులు తెలిపారు. ర్యాగింగ్‌కు పాల్పడిన వారిపై కఠిన చర్యలు ఉంటామని పేర్కొన్నారు. అయితే మెడికల్ కాలేజీ వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థలో ఇలాంటి ఘటన వెలుగుచూడటం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Also read-Adluri Laxman: నిజమని తేలితే రాజీనామాకు సిద్ధం.. నువ్వు సిద్ధమా? హరీశ్ రావుకు మంత్రి అడ్లూరి సవాల్‌

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News