Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలువురు ఐపీఎస్ (IPS) అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పరిపాలనాపరమైన అవసరాల దృష్ట్యా ఈ బదిలీలు చేపడుతున్నట్లు స్పష్టం చేస్తూ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. మార్కాపురం జిల్లా ఓఎస్డీ అడ్మిన్‌గా నవజ్యోతి మిశ్రాను, రాజమహేంద్రవరం అదనపు ఎస్పీ అడ్మిన్‌గా పాటిల్ దేవ్ రాజ్, పోలవరం జిల్లా ఓఎస్డీ అడ్మిన్‌గా మందా జావలి అల్ఫోన్స్, అమరావతి ఓఎస్డీ లాండ్ ఆర్డ్‌ర్‌గా మనోజ్ రామనాథ్ హెగ్డే, పల్నాడు జిల్లా అదనపు ఎస్పీగా రోహిత్ కుమార్ చౌదరి నియమితులయ్యారు.ఈ మేరకు తక్షణమే తమకు కేటాయించిన కొత్త స్థానాల్లో బాధ్యతలు స్వీకరించాల్సిందిగా బదిలీ అయిన ఐపీఎస్ అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
Also read-Kakinada: అదృశ్యమై నెల.. అయినా దొరకని జ్ఞానేశ్వరి ఆచూకీ!

