Virat Kohli: భారత క్రికెట్ అభిమానులకు షాకింగ్ న్యూస్. త్వరలో అఫ్గానిస్థాన్‌తో జరగబోయే మూడు వన్డేల సిరీస్‌కు టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ దూరమయ్యాడు. తొడకండరాల గాయం కారణంగా ఆయన ఈ సిరీస్‌కు అందుబాటులో ఉండటం లేదని బీసీసీఐ(BCCI) వర్గాలు వెల్లడించాయి.
ఐపీఎల్ ఫైనల్లో గాయం: ఇటీవలే ముగిసిన ఐపీఎల్-2026 సీజన్ ఫైనల్ మ్యాచ్‌లో కోహ్లీ గాయపడ్డాడు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఈ హోరాహోరీ పోరులో బ్యాటింగ్ చేస్తుండగా కోహ్లీ తొడకండరాలు పట్టేసాయి. గాయం తీవ్రత దృష్ట్యా అతనికి కొంతకాలం విశ్రాంతి అవసరమని వైద్య బృందం సూచించినట్లు తెలుస్తోంది. రాబోయే కీలక టోర్నీలను దృష్టిలో ఉంచుకునే బీసీసీఐ కోహ్లీకి ఈ సిరీస్ నుంచి రెస్ట్ ఇచ్చినట్లు సమాచారం.
Also read-Badminton: పీవీ సింధు సంచలనం.. మూడేళ్ల తర్వాత మళ్లీ టాప్-10 లోకి!
జూన్ 13 నుంచి సిరీస్ ప్రారంభం: షెడ్యూల్ ప్రకారం.. భారత్-అఫ్గానిస్థాన్ మధ్య ఈ నెల 13 నుంచి 20 వరకు మూడు వన్డేల సిరీస్ జరగనుంది. కోహ్లీ వంటి సీనియర్ ఆటగాడు దూరం కావడం జట్టుకు పెద్ద లోటే అయినప్పటికీ.. యువ ఆటగాళ్లకు తమని తాము నిరూపించుకోవడానికి ఇదొక మంచి అవకాశంగా మారనుంది. ఈ సిరీస్‌కు సంబంధించిన జట్టు ప్రకటనతో పాటు కోహ్లీ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారనేది బీసీసీఐ త్వరలోనే అధికారికంగా ప్రకటించనుంది.

