White House: అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసమైన శ్వేతసౌధం (వైట్‌హౌస్) సమీపంలో భారీ కాల్పుల శబ్దాలు కలకలం సృష్టించాయి. అక్కడ భద్రతా విధుల్లో ఉన్న సీక్రెట్ సర్వీస్ అధికారులు ఇద్దరు వ్యక్తులపై కాల్పులు జరిపినట్లు ఉన్నతాధికార వర్గాలు ధృవీకరించాయి.
రంగంలోకి రక్షణ బలగాలు: అధికారుల కాల్పుల్లో గాయపడిన వారిలో ఒకరు సాధారణ పౌరుడు కాగా.. మరొకరు అనుమానితుడిగా భావిస్తున్నారు. ఈ కాల్పుల ఘటనలో ఇద్దరూ తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. వెంటనే రంగంలోకి దిగిన రక్షణ బలగాలు ఘటనా స్థలం నుంచి ఒక తుపాకీని స్వాధీనం చేసుకున్నాయి.
Also Read-China: బొగ్గు గనిలో భారీ పేలుడు.. 82 మంది దుర్మరణం!
కాల్పుల ఘటనపై దర్యాప్తు ముమ్మరం: వైట్‌హౌస్ పరిసరాల్లో ఒక్కసారిగా భారీగా కాల్పుల శబ్దాలు వినిపించడంతో స్థానికులు, పర్యాటకులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. దీంతో ఈ ఘటనపై సీక్రెట్ సర్వీస్‌తో పాటు స్థానిక పోలీసులు తక్షణమే స్పందించి దర్యాప్తు ప్రారంభించారు. అసలు కాల్పులు జరపడానికి దారితీసిన పరిస్థితులు ఏంటి? అనుమానితుడి నేపథ్యం ఏమిటనే కోణంలో అధికారులు ఆరా తీస్తున్నారు.

