HomeTop StoriesBreaking: సీఎం పదవికి రాజీనామా చేస్తున్నా: సిద్ధరామయ్య

Breaking: సీఎం పదవికి రాజీనామా చేస్తున్నా: సిద్ధరామయ్య

CM Siddaramaiah: కర్ణాటక రాజకీయాల్లో అనూహ్య మార్పు చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త మార్పుకు నాంది పలికారు. ఈ రోజు ఉదయం తన నివాసంలో మంత్రులు, ఎమ్మెల్యేలకు ఏర్పాటు చేసిన అల్పాహార విందులో సిద్ధరామయ్య స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. తాను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు సహచర నేతలకు స్పష్టం చేశారు.

- Advertisement -

మధ్యాహ్నం గవర్నర్‌తో భేటీ: అల్పాహార విందులో తన నిర్ణయాన్ని ప్రకటించిన సిద్ధరామయ్య.. తదుపరి అడుగులకు సిద్ధమయ్యారు. ఈ రోజు మధ్యాహ్న భోజనం ముగిసిన తర్వాత ఆయన నేరుగా రాజ్‌భవన్‌కు వెళ్లనున్నారు. గవర్నర్‌ను కలిసి తన రాజీనామా లేఖను అధికారికంగా సమర్పించనున్నట్లు తెలుస్తోంది.

Also read-Karnataka: కన్నడ రాజకీయాల్లో ఉత్కంఠ.. గవర్నర్ అపాయింట్‌మెంట్ కోరిన సీఎం!

మధ్యప్రదేశ్ పర్యటనలో గవర్నర్‌: సీఎం సిద్ధరామయ్య అపాయింట్‌మెంట్ కోరినప్పటికీ.. ముందే ఖరారైన తన అధికారిక షెడ్యూల్ ప్రకారం గవర్నర్ థావర్‌చంద్ గహ్లోత్ మధ్యప్రదేశ్ పర్యటనకు వెళ్లారు. గవర్నర్ రాజధాని బెంగళూరులో అందుబాటులో లేకపోవడంతో.. సిద్ధరామయ్య తన రాజీనామాను ఈరోజే సమర్పిస్తారా? లేక గవర్నర్ తిరిగి వచ్చేవరకు వేచి చూస్తారా? అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. గవర్నర్ లేకపోయినప్పటికీ రాజ్‌భవన్‌ కార్యాలయంలో రాజీనామా లేఖను అందిస్తారనే ప్రచారం జరుగుతోంది. మొత్తానికి సిద్ధూ రాజీనామా ఎపిసోడ్‌తో కర్ణాటక రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News