Gold Price Today: మెున్నటి వరకు దూకుడుగా పెరుగుతూ పోయిన వెండి రేట్లు ప్రస్తుతం చల్లబడుతున్నాయి. ఇదే క్రమంలో బంగారం ధరలు మాత్రం కొద్దిగా పెరుగుతూ తగ్గుతూ ఊగిసలాడుతున్నాయి. అంతర్జాతీయంగా గత కొంత కాలంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేస్తున్న పనులతో అలాగే నిర్ణయాలతో ఇన్వెస్టర్లలో ఆందోళనలు పెరగటమే ఊహించని మార్పులకు కారణంగా నిపుణులు చెబుతున్నారు. సంక్రాంతి షాపింగ్ చేయాలనుకున్న వ్యక్తులు మాత్రం మారిన తాజా రేట్లను గమనించండి.
గ్లోబల్ రాజకీయ ఉద్రిక్తతలు, అమెరికా డాలర్ బలహీనత, ఫెడరల్ వడ్డీ రేట్ల, ఇండస్ట్రీ డిమాండ్ లాంటి కారణాలతో ఈ విలువైన లోహాలు పెరుగుతున్నాయి. మరోపక్క ప్రెసిడెంట్ ట్రంప్ ఫార్మా, ఆటో టారిప్స్ కూడా ప్రకటించటంతో చాలా మంది విలువైన లోహాలను హెడ్జింగ్ కోసం వాడుకుంటున్నట్లు నిపుణులు చెబుతున్నారు. అయితే కొత్త ఏడాదిలో అంతర్జాతీయ పరిణామాలు మెల్లగా కొలిక్కి వచ్చేందుకు ప్రయత్నాలు జరిగితే ధరలు తగ్గుతాయని నిపుణులు అంటున్నారు.
also read Mexico : ట్రంప్ నెక్స్ట్ టార్గెట్ మెక్సికో.. గ్రౌండ్ ఆపరేషన్ స్టార్ట్.!
శుక్రవారం రోజున 24 క్యారెట్ల గోల్డ్ రేటు గ్రాముకు హైదరాబాద్, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్, విజయవాడ, నెల్లూరు, కడప, తిరుపతి, విశాఖ నగరాల్లో గ్రాము రేటు రూ.13,871 వద్ద ఉంది. ఇదే నగరాల్లో 22 క్యారెట్ల గోల్డ్ గ్రాము ధర రూ.12,715 వద్ద కొనసాగుతోంది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో వెండి రేట్లను పరిశీలిస్తే.. కేజీ వెండి ఇవాళ రూ.2 లక్షల 68 వేల వద్ద ఉంది.
ఇక దేశంలోని ఇతర మెట్రో నగరాల్లో ఇవాళ్టి గోల్డ్ రేట్లను గమనిస్తే.. 24 క్యారెట్ల గ్రాము రేటు చెన్నైలో రూ.13,964, ముంబైలో రూ.13,871, దిల్లీలో రూ.13,886, కలకత్తాలో రూ.13,871, బెంగళూరులో రూ.13,871, కేరళలో రూ.13,871 వద్ద కొనసాగుతున్నాయి.
ఇక 22 క్యారెట్ల గోల్డ్ రేట్లు దేశంలోని ముఖ్యమైన మెట్రో నగరాల్లో నేడు పెరిగిన తర్వాత గమనిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.12,800, ముంబైలో రూ.12,715, దిల్లీలో రూ.12,730, కలకత్తాలో రూ.12,715, బెంగళూరులో రూ.12,715, కేరళలో రూ.12,715గా ఉన్నాయి.

