SIT notices to Bandi Bhagirath: కేంద్ర హోంశాఖ సహాయమంత్రి, బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌కు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నోటీసులు జారీ చేసింది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు కూకట్‌పల్లి డీసీపీ రితిరాజ్‌తో కూడిన సిట్ బృందం ఏర్పాటైంది. ఈ సిట్ బృందం ఇవాళ సాయంత్రం బండి భగీరథ్‌కు నోటీసులు పంపించింది. రేపు (బుధవారం) మధ్యాహ్నం రెండు గంటలకు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. బండి భగీరథ్ ఓ మైనర్ బాలికపై లైంగిక దాడి చేశాడనే ఆరోపణలతో అతనిపై పోక్సో కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిట్ విచారణకు ఆదేశించింది. నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు సిట్ దర్యాప్తుకు ఆదేశించింది.
Also Read: https://teluguprabha.net/telangana/ponguleti-on-indirammas-house/
కేసును సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం..
కాగా, బండి భగీరథ్ కేంద్ర మంత్రి కుమారుడు కావడంతో సంచలనంగా మారింది. కేసును నీరుగార్చేందుకు అధికారులపై రాజకీయ ఒత్తిళ్లు ఉండే అవకాశం ఉన్నందున.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును సీరియస్‌గా తీసుకుంది. కేసు విచారణ పారదర్శకంగా జరగాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డీజీపీని ఇటీవల ఆదేశించారు. అయితే, బండి భగీరథ్‌పై బాధితురాలి తల్లి ఫిర్యాదు చేయగా.. తనను హనీట్రాప్ చేశారని బండి భగీరథ్ కరీంనగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. నిజానిజాలు సిట్ దర్యాప్తులో వెల్లడికానున్నాయి.

