HomeTop StoriesICC: దాదాకు అరుదైన గౌరవం.. ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు!

ICC: దాదాకు అరుదైన గౌరవం.. ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు!

ICC Hall of Fame: భారత క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకరైన సౌరభ్‌ గంగూలీ(Sourav Ganguly)కి అరుదైన గౌరవం దక్కింది. ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో దాదాకు చోటు దక్కింది. ఈ విషయాన్ని సౌరభ్‌ ‘ఎక్స్‌’ వేదికగా ప్రకటించారు. తనను ఈ ఎలైట్ క్లబ్‌లో చేర్చినందుకు ఐసీసీ(ICC)కి, ఐసీసీ ఛైర్మన్‌ జైషాకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -

12వ భారతీయుడిగా రికార్డు: “ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కించుకోవడం నాకెంతో గర్వకారణం. ఈ గౌరవాన్ని అందుకున్న పన్నెండు మంది భారతీయుల్లో ఒకరిగా నిలవడం అద్భుతమైన అనుభూతిని ఇస్తోంది” అని సోషల్‌ మీడియా వేదికగా గంగూలీ పేర్కొన్నారు. క్రికెట్ ప్రపంచంలో అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఆటగాళ్లను ఐసీసీ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌తో గౌరవిస్తుంది. ఇప్పటివరకు భారతదేశం నుంచి లెజెండరీ ఆటగాళ్లు మాత్రమే ఈ జాబితాలో చోటు దక్కించుకోగా.. ఇప్పుడు గంగూలీ చేరికతో ఈ గౌరవం పొందిన భారతీయుల సంఖ్య 12కు చేరింది. భారత క్రికెట్‌ను దూకుడైన ఆటతీరుతో కొత్త శకానికి నడిపించిన గంగూలీకి ఆయన పుట్టినరోజు నాడే ఈ ఘనత దక్కడం పట్ల దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు, ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News