HomeTop StoriesFriendship: అవిశ్వాస రాజకీయాల్లో విశ్వాస శిఖరాలు.. రేవంత్, వేం నరేందర్‌ల అరుదైన స్నేహం!

Friendship: అవిశ్వాస రాజకీయాల్లో విశ్వాస శిఖరాలు.. రేవంత్, వేం నరేందర్‌ల అరుదైన స్నేహం!

True friendship: రాజకీయాలు అంటేనే ఎత్తుకు పైఎత్తు. అధికార దాహంతో కుటుంబాలే విడిపోయిన సందర్భాలు కోకొల్లలు. రాజనీతి అంటేనే ఎత్తుగడలు, అనుమానాలు అనే నేటి రాజకీయాల్లో ఆ ఇద్దరి స్నేహం ఓ విశ్వాస శిఖరం. వెన్నుపోట్లు, స్వార్థ ప్రయోజనాలే పరమావధిగా సాగే నేటి రాజకీయాల్లో.. నమ్మకం అనే పునాదిపై నిర్మించుకున్న వీరి ప్రయాణం ఓ అరుదైన బాట. తెలంగాణ రాజకీయ యవనికపై సీఎం రేవంత్ రెడ్డి, ఆయన అత్యంత సన్నిహితుడు వేం నరేందర్ రెడ్డిల మధ్య ఉన్న బంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విడదీయలేని వీరి స్నేహం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఒక ఆదర్శవంతమైన చర్చకు దారితీస్తోంది.

- Advertisement -

అనుమానం లేని చోట నమ్మకమే పునాది!: సాధారణంగా రాజకీయాల్లో ఎప్పుడు ఎవరు ఎటువైపు వెళ్తారో తెలియదు. ఎవరిపై ఎవరికి అనుమానం కలుగుతుందో చెప్పడం కష్టం. కానీ రేవంత్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డిల విషయంలో మాత్రం కేవలం నమ్మకం మాత్రమే మాట్లాడుతుంది. కష్టకాలంలోనూ, విజయపథంలోనూ ఒకరికొకరు తోడుగా నిలుస్తూ.. రాజకీయాల్లో అరుదుగా కనిపించే దృఢమైన విశ్వాసానికి వీరు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నారు.

అవిశ్వాసాల మధ్య అచంచల విశ్వాసం: రాజకీయ సంక్షోభాలు ఎదురైనప్పుడు అనేక మంది సన్నిహితులు దూరమైన తరుణంలో సైతం వీరిద్దరి మధ్య బంధం ఇసుకరేణువంత కూడా తగ్గలేదు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా రేవంత్ రెడ్డికి ఒక నీడలా, ఒక బలమైన వాయిస్‌లా వేం నరేందర్ రెడ్డి ఉంటూ వస్తున్నారు. రేవంత్‌ రెడ్డి గతంలో పార్టీ పగ్గాలు చేపట్టినప్పటి నుండి నేటి వరకు పార్టీ శ్రేణులకు, ప్రభుత్వానికి మధ్య ఒక వారధిగా ఉంటూనే రేవంత్ రెడ్డి నమ్మకాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు.

ఒకే బాట.. ఒకే మాట: తాజాగా ఆయన సీఎం సలహాదారు పదవికి రాజీనామా చేసినా అది కేవలం రాజకీయ వ్యూహాల్లో భాగమే. రాజ్యసభకు వేం నరేందర్‌ రెడ్డి నామినేషన్‌ దాఖలు చేయడం అనేది వీరి మధ్య ఉన్న నమ్మకానికి అద్దం పట్టే మరో అడుగు అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News