HomeTop StoriesEbola Virus: ఎబోలా కలవరం.. కీలక ఆదేశాలు జారీ చేసిన భారత్‌!

Ebola Virus: ఎబోలా కలవరం.. కీలక ఆదేశాలు జారీ చేసిన భారత్‌!

Ebola Virus:ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఎబోలా వైరస్ కలకలం సృష్టిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. దేశ పౌరులను సురక్షితంగా ఉంచేందుకు వీలుగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. అత్యవసరమైతే తప్ప ప్రస్తుత పరిస్థితుల్లో విదేశాలకు ప్రయాణాలు చేయవద్దని స్పష్టం చేసింది.

- Advertisement -

విదేశీ ప్రయాణాలపై కీలక సూచనలు: ముఖ్యంగా ఆఫ్రికా ఖండంలోని కాంగో, ఉగాండా, దక్షిణ సూడాన్ దేశాలలో ఎబోలా వైరస్ ప్రభావం అత్యంత తీవ్రంగా ఉందని నివేదికలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా దేశాలకు వెళ్లాలనుకునే భారతీయ పౌరులు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని సూచించింది. ఒకవేళ తప్పనిసరైతే పూర్తి అప్రమత్తతతో ఉండాలని అధికారులు సూచించారు.

Also read-Supreme Court: వారి పిల్లలకు రిజర్వేషన్లు అవసరమా?

ఆఫ్రికా ఖండంలోని భారతీయులకు సూచనలు: ఉపాధి, వ్యాపారాల నిమిత్తం ఇప్పటికే కాంగో, ఉగాండా, దక్షిణ సూడాన్ దేశాలలో నివసిస్తున్న భారతీయులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్రం కోరింది. స్థానిక ఆరోగ్య శాఖ అధికారులు జారీ చేసే మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని తెలిపింది. వైరస్ లక్షణాలు కనిపించినా లేదా అనుమానం వచ్చినా తక్షణమే వైద్యులను సంప్రదించాలని కోరింది. అంతేకాకుండా రాయబార కార్యాలయ అధికారులకు సమాచారం అందించాలని అడ్వైజరీలో పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News