Srisailam Reservoir:ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు శ్రీశైలం జలాశయానికి వరద నీరు భారీగా పోటెత్తుతుంది. వర్షాలు తగ్గినప్పటికీ వరద నీరు మాత్రం రోజురోజుకి పెరుగుతూనే ఉంది.జూరాల ప్రాజెక్టు నుంచి జూరాల ప్రాజెక్టు నుంచి లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి శ్రీశైలం ప్రాజెక్టులో చేరుతుంది. దీంతో శ్రీశైలం జలాశయం జలకళను సంతరించుకుంది. ఆలమట్టి నుంచి వరద కొనసాగుతుండటంతో నీరు ఇంకా కొంచెం ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
మరో నాలుగైదు రోజులు…
వరద ఉధృతి మరో నాలుగైదు రోజులు కొనసాగే అవకాశం ఉందని శ్రీశైలం డ్యాంను పరిశీలిస్తున్న అధికారులు చెబుతున్నారు. రోజుకు లక్ష క్యూసెక్కులకు పైగా వరద నీరు వచ్చి చేరుతుందని తెలిపారు. కర్ణాటకలోని ఆలమట్టికి వరద కొనసాగుతుండటంతో నీటిని కిందికి వదులుతున్నారు.
గత కొద్ది రోజులుగా పెరుగుతున్న కృష్ణమ్మ.. సోమవారం సాయంత్రానికి 855.10 అడుగులకు చేరింది. ప్రస్తుతం 92.048 టీఎంసీల వరద నీరు జలాశయంలో ఉంది. మంగళవారం సాయంత్రానికి వంద టీఎంసీలకు చేరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. సోమవారం ఒక్క రోజే జూరాల ప్రాజెక్టు నుంచి చేరినట్లు అధికారులు తెలిపారు.
Also Read:Chandrababu: తెలంగాణాలోని ఆస్తులన్నీ అనుభవించేది వారే కదా

