కోల్‌కతా(తెలుగు ప్రభ): దుర్గా పూజ వేడుకల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. చోర్‌బగాన్ దుర్గా పూజా పండల్ వద్ద భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరగడంతో తొక్కిసలాట లాంటి పరిస్థితి ఏర్పడింది. ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ ఘటనలో 17 మంది మృతి చెందారు. మరో 25 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు.
వర్షం పడుతుండగా బయట వేచి ఉన్న భక్తులు ఒక్కసారిగా ముందుకు దూసుకురావడంతో కొందరు కిందపడిపోయి. దీంతో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు. క్షతగాత్రులను కోల్‌కతా మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి విపత్తు నిర్వహణ సిబ్బంది చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

