HomeTop StoriesHormuz : కువైట్ ట్యాంకర్‌పై క్షిపణి దాడి.. ఊపిరి పీల్చుకున్న భారత నావికులు

Hormuz : కువైట్ ట్యాంకర్‌పై క్షిపణి దాడి.. ఊపిరి పీల్చుకున్న భారత నావికులు

Kuwait tanker missile attack Hormuz : పశ్చిమాసియా సముద్ర జలాల్లో ఉద్రిక్తతల మేఘాలు కమ్ముకుంటున్న వేళ.. అంతర్జాతీయ వాణిజ్యానికి గుండెకాయ వంటి హర్మూజ్ జలసంధిలో పెను ప్రమాదం చోటుచేసుకుంది. కువైట్ పతాకంతో ప్రయాణిస్తున్న ముడి చమురు ట్యాంకర్‌పైకి దూసుకొచ్చిన క్షిపణి ఒక్కసారిగా ప్రకంపనలు సృష్టించింది.

- Advertisement -

తీరం చేరిన ఐదుగురు నావికులు : హర్మూజ్ జలసంధి మీదుగా పశ్చిమ ఆఫ్రికా దేశం టోగోలోని లోమే రేవుకు వెళ్తున్న ‘ఎంటీ కజిమా-3’ (MT Kazima III) ట్యాంకర్‌పై శనివారం క్షిపణి దాడి జరిగింది. సమాచారం అందిన వెంటనే రంగంలోకి దిగిన ఒమన్‌లోని భారత రాయబార కార్యాలయం, స్థానిక అధికారుల సమన్వయంతో మెరుపు వేగంతో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది. నౌకలోని ఐదుగురు భారతీయ పౌరులను సురక్షితంగా ఒడ్డుకు తరలించింది. ప్రాణాపాయం నుంచి తమ వారిని గట్టెక్కించిన ఒమన్ యంత్రాంగానికి భారత ఎంబసీ ‘ఎక్స్’ వేదికగా కృతజ్ఞతలు తెలిపింది.

భారతీయుల భద్రతపై నిరంతర నిఘా : ప్రస్తుతం పశ్చిమాసియా పరిధిలోని వాణిజ్య నౌకల్లో 4,500 మందికి పైగా భారత నావికులు విధులు నిర్వర్తిస్తున్నారని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. గల్ఫ్ పరిధిలోని నౌకలు, అందులోని సిబ్బంది రక్షణను భారత షిప్పింగ్ మంత్రిత్వ శాఖ అణువణువూ పర్యవేక్షిస్తోందని స్పష్టం చేశారు. ఎర్ర సముద్రం నుంచి నల్ల సముద్రం వరకు నౌకలపై జరుగుతున్న దాడులపై విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఇప్పటికే ఐరాసలో తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ వాణిజ్య మార్గాలను కాపాడేందుకు భారత్ 23 దేశాలతో కలిసి అంతర్జాతీయ కూటమిగా కట్టుబడి ఉందని తేల్చిచెప్పారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News