HomeTop StoriesTamil Nadu: తమిళనాడు సీఎం పీఠంపై వీడని ఉత్కంఠ.. హైదరాబాద్ చేరుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు!

Tamil Nadu: తమిళనాడు సీఎం పీఠంపై వీడని ఉత్కంఠ.. హైదరాబాద్ చేరుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు!

Tamil Nadu: తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో తమ ఎమ్మెల్యేలు చేజారిపోకుండా కాంగ్రెస్ అధిష్టానం అప్రమత్తమైంది. తమిళనాడు కాంగ్రెస్ కమిటీ (TNCC)కి చెందిన ఎమ్మెల్యేలందరినీ ప్రత్యేక విమానంలో చెన్నై నుండి హైదరాబాద్‌కు తరలించారు.

- Advertisement -

టీవీకే ప్రభుత్వానికి మద్దతు: తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK) పార్టీకి కాంగ్రెస్ ఇప్పటికే అధికారికంగా మద్దతు ప్రకటించింది. అయితే ప్రస్తుతం ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ లేకపోవడం, ఐయూఎంఎల్ (IUML) వంటి కీలక పార్టీలు మద్దతు ఉపసంహరించుకోవడంతో సీఎం పీఠం ఎవరనేదానిపై మరింత ఉత్కంఠ నెలకొంది. విజయ్ ప్రభుత్వం కొలువుదీరాలంటే ప్రతి ఎమ్మెల్యే మద్దతు ఇప్పుడు అత్యంత కీలకం. ఈ క్రమంలో ప్రత్యర్థి పార్టీలు తమ ఎమ్మెల్యేలకు గాలం వేసే అవకాశం ఉందన్న ఆందోళనతో కాంగ్రెస్ ఈ క్యాంప్ రాజకీయం మొదలుపెట్టింది.

తెలంగాణే సేఫ్ జోన్: తెలంగాణలో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉండటంతో, ఇక్కడ తమ ఎమ్మెల్యేలకు పూర్తి రక్షణ ఉంటుందని అధిష్టానం భావిస్తోంది. లోక్‌భవన్‌లో ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ పూర్తయి.. అసెంబ్లీలో బలపరీక్ష ముగిసే వరకు వీరంతా హైదరాబాద్‌లోనే ఉండనున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News