HomeTop StoriesWest Bengal: బెంగాల్ గడ్డపై వికసించిన కమలం.. సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన సువేందు

West Bengal: బెంగాల్ గడ్డపై వికసించిన కమలం.. సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన సువేందు

CM Suvendu Adhikari: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఒక కొత్త శకం ఆరంభమైంది. ఆ రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా బీజేపీ ప్రభుత్వం కొలువుదీరింది. శనివారం కోల్‌కతాలో జరిగిన అట్టహాసమైన కార్యక్రమంలో బెంగాల్ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ప్రమాణస్వీకారం చేశారు.

- Advertisement -

బెంగాల్‌ తొలి బీజేపీ సీఎం: పశ్చిమ బెంగాల్‌ రాజకీయ చరిత్రలో శనివారం ఒక చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. కోల్‌కతాలోని ప్రఖ్యాత బ్రిగేడ్‌ పరేడ్‌ గ్రౌండ్‌ వేదికగా బీజేపీ నేత సువేందు అధికారి రాష్ట్ర నూతన సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్ర గవర్నర్ ఆర్.ఎన్. రవి ఆయన చేత పదవీ స్వీకార ప్రమాణం చేయించారు. 55 ఏళ్ల సువేందు.. బెంగాల్‌కు ముఖ్యమంత్రి అయిన తొలి బీజేపీ నేతగా రికార్డు సృష్టించారు.

హాజరైన ప్రముఖులు: ఈ వేడుకకు ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరై నూతన ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు. వారితో పాటు కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, రాజ్‌నాథ్ సింగ్, కింజరాపు రామ్మోహన్ నాయుడు హాజరయ్యారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సైతం హాజరయ్యారు. భాజపా జాతీయాధ్యక్షుడు నితిన్ నబిన్‌తో పాటు పలువురు ఎన్డీయే కూటమి నేతలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News