HomeTop StoriesTamil Nadu: తమిళనాడులో టీవీకే ప్రభంజనం.. సెంచరీ కొట్టిన విజయ్‌!

Tamil Nadu: తమిళనాడులో టీవీకే ప్రభంజనం.. సెంచరీ కొట్టిన విజయ్‌!

Assembly Election: తమిళనాడు రాజకీయ ముఖచిత్రం మారబోతుంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో సంచలనాలు నమోదు అవుతున్నాయి. దశాబ్దాలుగా రాష్ట్రాన్ని ఏలుతున్న ద్రవిడ పార్టీల ఆధిపత్యానికి దళపతి విజయ్‌ గండికొట్టబోతున్నారు. ఫలితాల ట్రెండ్‌ చూస్తే.. తమిళనాడులో టీవీకే స్పష్టమైన ఆధిక్యంతో దూసుకుపోతుంది. ప్రస్తుతం తమిళగ వెట్రి కళగం 104 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతూ సెంచరీ మార్క్‌ను దాటేసింది.

- Advertisement -

బోసిపోయిన డీఎంకే కార్యాలయం: టీవీకే దూసుకుపోతున్న తరుణంలో డీఎంకే కార్యాలయం మూగబోయింది. అధికారం తమదేనన్న ధీమాతో ఉన్న డీఎంకేకు ఈ ఫలితాలు కోలుకోలేని దెబ్బ తీశాయి. ప్రస్తుతం డీఎంకే కేవలం 50 స్థానాలకే పరిమితం అయింది. ఇదే ట్రెండ్‌ కొనసాగుతే స్టాలిన్‌ పార్టీ 50 సీట్లలోపే పరిమితం కానుంది.

Also read-Live updates: పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ, భాజపా హోరాహోరీ

విస్మయంలో ఏఐడీఎంకే: ఫలితాల సరళిపై ఏఐడీఎంకే నేతలు సైతం దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతోందో అర్థం కాక విస్మయం వ్యక్తం చేస్తున్నారు. విజయ్ పార్టీ ఈ స్థాయిలో ప్రభావం చూపుతుందని ఊహించలేకపోయామని అంటున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న ఈ ట్రెండ్స్ చివరివరకు కొనసాగితే తమిళనాడులో విజయ్ అధికారాన్ని చేజిక్కించుకునే ఛాన్స్ ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News