HomeTop StoriesTamil Nadu: డీలిమిటేషన్‌ ప్రతులను దహనం చేసిన సీఎం ఎంకే స్టాలిన్‌

Tamil Nadu: డీలిమిటేషన్‌ ప్రతులను దహనం చేసిన సీఎం ఎంకే స్టాలిన్‌

Tamil Nadu CM MK Stalin: డీలిమిటేషన్‌ బిల్లుపై తమిళనాడు సీఎం తన అసహనాన్ని వ్యక్తం చేశారు. బిల్లు ప్రతిని తగలబెట్టారు. ఈ మంటలు బీజేపీ అహంకారాన్ని అణచివేస్తాయని అన్నారు.

- Advertisement -

బీజేపీ అహంకారాన్ని అణచివేస్తాం: నియోజకవర్గాల పునర్విభజన(డీలిమిటేషన్‌) బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌ పేర్కొన్నారు. ఈ బిల్లును ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించబోమని తెలిపారు. గతంలో తమిళనాడులో హిందీకి వ్యతిరేకంగా చేపట్టిన ప్రతిఘటన జ్వాల దిల్లీని దహించివేసిందని అన్నారు. ఇప్పుడు ఈ బిల్లు ప్రతిని తగలబెట్టి తాను మరో జ్వాలను రగిలించినట్లు తెలిపారు. ఈ మంటలు బీజేపీ అహంకారాన్ని అణచివేస్తాయని చెప్పారు.

Also read-Lok Sabha: నేడు లోక్‌సభ ముందుకు మూడు కీలక బిల్లులు.. దేశ వ్యాప్తంగా ఉత్కంఠ!

నేడు లోక్‌సభ ముందుకు రానున్న మూడు కీలక బిల్లులు:

  • 2011 జనాభా లెక్కల ఆధారంగా డీలిమిటేషన్ చేపట్టడం కోసం 131వ రాజ్యాంగ సవరణ బిల్లును లోక్‌సభ ముందుకు తీసుకురానున్నారు. లోక్‌సభ సీట్ల సంఖ్యను ప్రస్తుతం ఉన్న 550 నుంచి గరిష్ఠంగా 850కి పెంచడం దీని ప్రధాన ఉద్దేశం. అంతేకాకుండా దీని ద్వారా 2029 నుంచి మహిళా రిజర్వేషన్లు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.
  • లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన కోసం ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటు చేసేందుకు డీలిమిటేషన్ కమిషన్ బిల్లు మోదీ ప్రభుత్వం సభ ముందుకు తీసుకురానుంది.
  • ఇక మూడో బిల్లు కేంద్రపాలిత ప్రాంతాల్లో నియోజకవర్గాల మార్పులు, చేర్పులకు అవకాశం కల్పించే బిల్లు. ఈ బిల్లు ఆమోదానికి సాధారణ మెజారిటీ సరిపోతుంది.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News