HomeTop StoriesTamil Nadu: నేను మీ ఇంట్లో మనిషిని.. సీఎం విజయ్ భావోద్వేగ ప్రసంగం

Tamil Nadu: నేను మీ ఇంట్లో మనిషిని.. సీఎం విజయ్ భావోద్వేగ ప్రసంగం

Tamil Nadu CM Vijay: తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత విజయ్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో సరికొత్త శకం ప్రారంభమైందని అన్నాను. అబద్ధపు హామీలతో ప్రజలను మోసం చేయనని ఆయన స్పష్టం చేశారు.

- Advertisement -

నేను మీ ఇంట్లో మనిషిని: “నేను మీ ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడిని. మీ అన్నగా, తమ్ముడిగా ఎల్లప్పుడూ మీకు అండగా ఉంటాను. నాకు ఆకలి విలువ తెలుసు. పేదరికం అంటే ఏంటో తెలుసు. అందుకే పేదల కష్టాలను తీర్చడమే నా లక్ష్యం” అని విజయ్ పేర్కొన్నారు. రాజకీయాల్లో తప్పుడు వాగ్దానాలు చేయబోనని ఆయన స్పష్టం చేశారు. “అది చేస్తాం, ఇది చేస్తాం అని నమ్మబలకను. ఏది సాధ్యమో అది మాత్రమే చేస్తానని మాట ఇస్తున్నాను. నన్ను నమ్మి నా వెంట నడుస్తున్న మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మోసం చేయను” అని హామీ ఇచ్చారు. తన ప్రభుత్వంలో ఎటువంటి విభేదాలకు తావుండదని అన్నారు. సామాన్య ప్రజల ప్రయోజనాలే పరమావధిగా ఒకే పవర్ సెంటర్‌గా పాలన సాగుతుందని తెలిపారు. చిన్నారులకు, యువతకు తాను మామగా అండగా ఉంటానని చెప్పారు. “యువత కన్న కలలను మీ విజయ్ మామ నెరవేరుస్తాడు. నా వెన్నంటి నిలిచిన యువతకు ప్రత్యేక ధన్యవాదాలు” అని తెలిపారు.

Also read-Tamil Nadu: 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌పై సీఎం విజయ్‌ తొలి సంతకం

ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం: రాష్ట్ర ప్రస్తుత ఆర్థిక పరిస్థితిపై ప్రజలకు స్పష్టతనిచ్చేందుకు త్వరలోనే శ్వేతపత్రాన్ని విడుదల చేస్తామని ప్రకటించారు. ఇది అస్థిర ప్రభుత్వం కాదని.. సుస్థిర పాలన అందిస్తామని ధీమా వ్యక్తం చేశారు. తనను అవమానించే వారు ప్రతిచోటా ఉంటారు. అలాగే రాజకీయాల్లో సైతం ఉంటారని అన్నారు. కానీ వారందరినీ తాను శ్రేయోభిలాషులుగానే భావిస్తానని విజయ్ ఉదారతను సీఎంగా తొలి ప్రసంగంలోనే చాటుకున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News