HomeTop StoriesTamil Nadu: 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌పై సీఎం విజయ్‌ తొలి సంతకం

Tamil Nadu: 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌పై సీఎం విజయ్‌ తొలి సంతకం

Tamil Nadu CM Vijay: తమిళనాడు నూతన సీఎంగా సినీ నటుడు జోసెఫ్ విజయ్ బాధ్యతలు చేపట్టారు. గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ ఆయనతో పదవీ స్వీకార ప్రమాణం చేయించారు. రాజకీయ, సినీ రంగ ప్రముఖుల సమక్షంలో జరిగిన ఈ వేడుకతో తమిళ రాజకీయాల్లో ఒక కొత్త అధ్యాయం మొదలైంది.

- Advertisement -

అభిమానుల హోరు: ఈ చారిత్రాత్మక ఘట్టానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సినీ తారలు హాజరై విజయ్‌కు అభినందనలు తెలిపారు. స్టేడియం పరిసర ప్రాంతాలన్నీ దళపతి నినాదాలతో మారుమోగిపోయాయి. తమ అభిమాన నటుడు రాష్ట్ర సారథిగా బాధ్యతలు తీసుకోవడంపై అభిమానులు పండుగ చేసుకున్నారు.

Also read-CM Vijay: తమిళనాడులో నూతన శకం.. సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన విజయ్‌

సీఎంగా విజయ్‌ తొలి సంతకం: ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే విజయ్ పాలనలో తన మార్కును చాటుకున్నారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలు దిశగా మూడు కీలక ఫైళ్లపై సంతకాలు చేశారు. రాష్ట్రంలోని పేద, మధ్యతరగతి ప్రజలకు ఊరటనిస్తూ 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకంపై మొదటి సంతకం చేశారు. రాష్ట్రంలో మహిళల రక్షణను పటిష్టం చేసే ఫైలుపై రెండో సంతకం చేశారు. మాదకద్రవ్యాల నిర్మూలన కోసం ‘ఈగల్’ తరహా ప్రత్యేక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేస్తూ మూడో సంతకం చేశారు. తొలి రోజే ప్రజా సంక్షేమం, భద్రత లక్ష్యంగా విజయ్ తీసుకున్న ఈ నిర్ణయాలపై రాష్ట్రవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. సామాన్యుల సంక్షేమమే తన ప్రభుత్వ ప్రాధాన్యత అని ఈ సంతకాల ద్వారా ఆయన స్పష్టం చేశారు.

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News