HomeTop StoriesTamil Nadu: సీఎం విజయ్ సంచలన నిర్ణయం.. మద్యం దుకాణాల మూసివేత!

Tamil Nadu: సీఎం విజయ్ సంచలన నిర్ణయం.. మద్యం దుకాణాల మూసివేత!

Tamil Nadu CM Vijay: తమిళనాడు సీఎంగా బాధ్యతలు చేపట్టిన విజయ్.. సంచలన నిర్ణయాలతో దూసుకుపోతున్నారు. సామాజిక భద్రతే లక్ష్యంగా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రజల విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకున్న విజయ్‌.. బహిరంగ ప్రదేశాల్లో ఉన్న మద్యం దుకాణాలను తక్షణమే తరలించాలని అధికారులను ఆదేశించారు.

- Advertisement -

విద్యా సంస్థలు, ఆలయాల వద్ద మద్యం దుకాణాలు రద్దు: విద్యా సంస్థలు, ప్రార్థనా మందిరాలతో పాటు బస్టాండ్లకు 500 మీటర్ల పరిధిలో ఉన్న ఏ ఒక్క మద్యం దుకాణం కూడా ఉండకూడదని సీఎం స్పష్టం చేశారు. 500 మీటర్ల పరిధిలో సుమారు 717 మద్యం షాపులు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. దీంతో వెంటనే వాటిని అక్కడి నుంచి తరలించాలని ఆదేశించారు. ఈ ప్రక్రియ మొత్తాన్ని రెండు వారాల్లోపు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News