HomeTop StoriesTn Government:బంగారం, పట్టుచీర, సైకిళ్లు, మేకలు, ఆవులు.. అన్ని ఫ్రీనే..అదరగొట్టిన విజయ్‌ సర్కార్‌ బడ్జెట్‌!

Tn Government:బంగారం, పట్టుచీర, సైకిళ్లు, మేకలు, ఆవులు.. అన్ని ఫ్రీనే..అదరగొట్టిన విజయ్‌ సర్కార్‌ బడ్జెట్‌!

తమిళనాడులో టీవీకే గవర్నమెంట్‌ మొదటిసారి రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు ముఖ్యమంత్రి విజయ్ పెద్దపీట వేసినట్లు తెలుస్తోంది. అసెంబ్లీలో 2026–27 సంవత్సరానికి సంబంధించిన పూర్తిస్థాయి బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి మరియ విల్సన్ ప్రవేశపెట్టారు.

- Advertisement -

ఆయన బడ్జెట్ ప్రసంగంలో కీలక పథకాల ప్రస్తావన ఉంది. అంతేకాకుండా వాటికి భారీగా నిధులు కూడా కేటాయించారు. మరి విజయ్ సర్కార్ ఈ ఆర్థిక సంవత్సరంలో ఏఏ పథకాలను అమలుచేయబోతుందో తెలుసా..

చిన్నారులకు బంగారాన్ని…

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి అన్నాదురై జయంతి సందర్భంగా వచ్చేనెల 15న చిన్నారులకు బంగారాన్ని అందించే పథకాన్ని ప్రారంభించనున్నట్లు విజయ్ ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం బడ్జెట్ లో రూ.560 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. తమిళనాడులో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించే తల్లులకు 1 గ్రాము బంగారు ఉంగరం ఇస్తారు. జూన్ 22 నుంచి ప్రభుత్వ ఆసుపత్రుల్లో పుట్టిన పిల్లలు ఈ పథకానికి అర్హులుగా ఉంటారని ఆర్థిక మంత్రి తెలిపారు.

‘సూపర్ క్లీన్ – సూపర్ క్యాంపస్’…

తమిళనాడు బడ్జెట్ లో విద్యాశాఖకు కూడా భారీగా నిధులు కేటాయించారు. రాష్ట్రవ్యాప్తంగా 10 వేల ప్రభుత్వ పాఠశాలల్లో ‘సూపర్ క్లీన్ – సూపర్ క్యాంపస్’ పథకాన్ని ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకం ద్వారా పాఠశాల ప్రాంగణాలను ఎల్లప్పుడూ శుభ్రంగా, సురక్షితంగా ఉంచుతారు. మొదటి దశ అమలు కోసం ప్రభుత్వం రూ.139 కోట్లు కేటాయించింది.

ఇక విద్యార్థుల కోసం హెల్మెట్, వాటర్ బాటిల్‌తో కూడిన సైకిళ్లను విద్యార్థులకు అందించనున్నారు.. ఈ పథకం కోసం రూ.277 కోట్లు కేటాయించారు. పాఠశాల విద్య నాణ్యతను పెంచేందుకు పాఠ్యప్రణాళిక సంస్కరణల కోసం రూ.25 కోట్లు, పబ్లిక్ లైబ్రరీలను డిజిటల్ లైబ్రరీలుగా మార్చేందుకు రూ.10 కోట్లు కేటాయించినట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు.

మహిళల జీవనోపాధిని…

తమిళనాడు బడ్జెట్‌లో మహిళల జీవనోపాధిని మెరుగుపరిచేందుకు రెండు కీలక పథకాలను ప్రకటించింది. ఉచితంగా పాలు ఇచ్చే ఆవులు, మేకలు అందించే ఈ పథకాల కోసం మొత్తం రూ.167 కోట్లు కేటాయించినట్లు ఆర్థిక మంత్రి మరియా విల్సన్ తెలిపారు.

గ్రామీణ మహిళల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు పాడి ఆవుల పంపిణీ పథకానికి రూ.57 కోట్లు కేటాయించారు. ఈ పథకం కింద ప్రతి సంవత్సరం అర్హులైన 10,000 మంది మహిళలకు ఉచితంగా పాడి ఆవులను అందిస్తామని ఆర్థిక మంత్రి తెలిపారు.

ఇక మేకల పంపిణీ కోసం కొత్త పథకాన్ని కూడా ప్రభుత్వం ప్రకటించింది. దీని కోసం రూ.110 కోట్లు కేటాయించారు. ఈ పథకం కింద వితంతువులు, నిరాశ్రయులైన మహిళలు, ట్రాన్స్‌జెండర్లు, దివ్యాంగులకు 100 శాతం సబ్సిడీతో ఒక్కొక్కరికి 5 మేకలను ఉచితంగా అందిస్తారు.

పెళ్లి కూతురికి..కాసు బంగారం..

పెళ్లి చేసుకోబోయే యువతులకు 8 గ్రాముల బంగారం, పట్టుచీర ఇచ్చే పథకాన్ని తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. ఎన్నికల హామీగా ఇచ్చిన ఈ పథకాన్ని అమలు చేయడానికి అవసరమైన నిధులు, విధివిధానాలను బడ్జెట్‌లో చేర్చారు. కుటుంబ వార్షిక ఆదాయం రూ.5 లక్షల కంటే తక్కువ ఉన్న వధువులు ఈ పథకానికి ప్రధాన లబ్ధిదారులుగా ఉండే అవకాశం ఉంది.

Also Read:Vijayawada:విజయవాడ – వాడపల్లి వన్-డే టూర్ ప్యాకేజీ ప్రారంభం..

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News