Tamil Nadu: తమిళనాడు రాజకీయాల్లో నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. తమిళగ వెట్రి కళగం (TVK) నేతృత్వంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ అనుమతినిచ్చారు. ఈ కీలక పరిణామంతో విజయ్ తమిళనాడు తదుపరి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే మార్గం సుగమమైంది.
గవర్నర్‌తో విజయ్ భేటీ: టీవీకే అధినేత విజయ్ ఈరోజు ఉదయం రాజ్‌భవన్‌లో గవర్నర్‌తో మరోసారి భేటీ అయ్యారు. అసెంబ్లీలో తమ పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిందని తెలిపారు. ప్రభుత్వ ఏర్పాటు కోసం తమ పార్టీని ఆహ్వానించాలని కోరారు. అసెంబ్లీ వేదికగా తమ బలాన్ని నిరూపించుకుంటామని గవర్నర్‌కు విజయ్ హామీ ఇచ్చారు.
గవర్నర్ గ్రీన్ సిగ్నల్: విజయ్‌తో సుదీర్ఘ చర్చల అనంతరం గవర్నర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత రాజకీయ సమీకరణాలను పరిగణనలోకి తీసుకున్న గవర్నర్.. ప్రభుత్వ ఏర్పాటుకు సానుకూలత వ్యక్తం చేస్తూ అనుమతించారు.
లోక్ భవన్ నుంచి పార్టీ కార్యాలయానికి విజయ్: గవర్నర్‌తో భేటీ ముగిసిన వెంటనే విజయ్ లోక్ భవన్ నుంచి నేరుగా పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ పార్టీ ముఖ్య నేతలతో భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. ప్రభుత్వ ఏర్పాటుతో పాటు ప్రమాణ స్వీకార వేదిక మరియు సమయం వంటి వివరాలపై మరికొద్ది సేపట్లో టీవీకే నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

