HomeTop StoriesDeputy CM Bhatti: "వైఎస్‌ఆర్‌ పేదల పక్షపాతి.. గొప్ప పాలనాదక్షుడు"

Deputy CM Bhatti: “వైఎస్‌ఆర్‌ పేదల పక్షపాతి.. గొప్ప పాలనాదక్షుడు”

పంజాగుట్ట‌,(తెలుగు ప్రభ):  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత డాక్టర్‌ వైఎస్ రాజశేఖర రెడ్డి పేదల పక్షపాతి అని తెలంగాణ డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్రమార్క కొనియాడారు. వైఎస్‌ఆర్‌ 77వ జయంతి సందర్భంగా పంజాగుట్ట‌లోని ఆయ‌న విగ్ర‌హాల‌కు ఘనంగా భ‌ట్టి విక్ర‌మార్క నివాళులు అర్పించారు. ఈ కార్య‌క్ర‌మంలో మంత్రి శ్రీధ‌ర్ బాబు, ప్ర‌భుత్వ ల‌స‌హాదారు ష‌బ్బీర్ ఆలీ, ప్లానింగ్ క‌మిష‌న్ వైస్ ఛైర్మ‌న్ చిన్నారెడ్డి, ఎమ్మెల్యే దానం నాగేంద‌ర్, మాజీ ఎంపీ కేవీపీ రామ‌చంద్ర రావు త‌దిత‌రులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా వైఎస్సార్ జ‌యంతి సంద‌ర్భంగా ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క కేక్ క‌ట్ చేశారు.

- Advertisement -

రైతే రాజుగా-పేదవాడే ప్రాధాన్యతగా పాలన: వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తీసుకున్న నిర్ణయం రైతుల పట్ల ఆయనకున్న చిత్తశుద్ధికి నిదర్శనమని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. “ప్రమాణ స్వీకారం చేసిన మొదటి నిమిషమే రైతుల ఉచిత విద్యుత్ ఫైలుపై సంతకం చేసిన గొప్ప నాయకుడు ఆయన” అని కొనియాడారు. వైఎస్‌ఆర్‌ అమలు చేసిన విప్లవాత్మక పథకాలు సమాజంలోని అట్టడుగు వర్గాల జీవితాల్లో వెలుగులు నింపాయని ఆయన గుర్తుచేశారు.

Also read-YS Jagan: “మీరే నా స్ఫూర్తి.. మీ ఆశీస్సులే నా ధైర్యం.. మిస్ యూ నాన్నా”

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News