EAPCET Results: తెలంగాణ ఈఏపీసెట్ (TG EAPCET 2026) (ఇంజినీరింగ్, అగ్రికల్చర్-ఫార్మసీ) ఫలితాలు అధికారికంగా విడుదలయ్యాయి. హైదరాబాద్‌లోని జేఎన్‌టీయూ (JNTU-H) వేదికగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొ.వి.బాలకృష్ణారెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా తదితర ఉన్నతాధికారులు ఈ ఫలితాలను విడుదల చేశారు. వర్సిటీ ఇటీవల విడుదల చేసిన ప్రాథమిక కీ పై అభ్యర్థుల నుంచి వచ్చిన అభ్యంతరాలను పరిశీలించిన అనంతరం తుది ఫలితాలతో పాటు ర్యాంకులను ప్రకటించారు.
పరీక్ష ముగిసిన 6 రోజుల్లోనే ఫలితాలు: ఈఏపీసెట్ చరిత్రలోనే పరీక్షలు ముగిసిన కేవలం ఆరో రోజే ఫలితాలను విడుదల చేసి జేఎన్‌టీయూ-హెచ్ సరికొత్త రికార్డు సృష్టించింది. మే 4, 5 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాలకు పరీక్షలు జరగ్గా.. మే 9 నుండి 11 వరకు ఇంజినీరింగ్ విభాగానికి ఆన్‌లైన్ పరీక్షలు జరిగాయి. ఈ ఏడాది మొత్తం 2.8 లక్షలకు పైగా విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. ఇందులో ఇంజినీరింగ్ విభాగానికి 1,97,241 మంది హాజరవగా.. అగ్రికల్చర్ విభాగానికి 84,954 మంది విద్యార్థులు ఉన్నారు. విద్యార్థుల్లో ఉత్కంఠను తగ్గించేందుకు ఈ ఏడాది విద్యాశాఖ సరికొత్త సాంకేతిక విధానాన్ని ప్రవేశపెట్టింది. పరీక్ష ముగియగానే ప్రాథమిక కీ ఆధారంగా అభ్యర్థికి వచ్చిన మార్కులు కంప్యూటర్ స్క్రీన్‌పైనే ప్రత్యక్షమయ్యేలా చేసిన ప్రయోగం విజయవంతమైందని అధికారులు ఈ సందర్భంగా పేర్కొన్నారు.
Also read-Army jobs: ఇంటర్ అర్హతతో ఆర్మీలో ఉద్యోగం.. లక్షన్నరకు పైగా జీతం!
ఫలితాలు చూసుకునే విధానం: పరీక్ష రాసిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ www.eapcet.tgche.ac.in ద్వారా తమ ఫలితాలను, ర్యాంకులను తెలుసుకోవచ్చు. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్, హాల్ టికెట్ నంబర్ మరియు పుట్టిన తేదీ వివరాలను నమోదు చేసి ర్యాంక్ కార్డ్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం విడుదల చేసిన ఈఏపీసెట్ ర్యాంకుల ఆధారంగానే రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం త్వరలోనే కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను విడుదల చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఇంజినీరింగ్ విభాగంలో టాప్ ర్యాంకర్లు:
- ఎం. రుషి (ఉప్పల్)
- అన్షుల్ (మూసాపేట్)
- ఎం.వంశీధర్‌రెడ్డి (పులివెందుల)
- జె.రోషన్ మణిదీప్‌రెడ్డి (గుంటూరు)
- ఎ.సాయి నిఖిత్ (మహబూబ్‌నగర్)
అగ్రికల్చర్- ఫార్మసీ విభాగంలో టాప్ ర్యాంకర్లు:
- ఎం.అహ్మద్ (హైదరాబాద్)
- టి.నివృత్ సాయికిరణ్ (హైదరాబాద్)
- జి.సాహితి గీతిక (రంగారెడ్డి)
- ఎం.జయసింహ (హైదరాబాద్)
- ఎ.అన్వాస్ (హైదరాబాద్)

