HomeTop StoriesCM Revanth: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం.. సీఎం రేవంత్ స్పెషల్ ట్వీట్‌!

CM Revanth: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం.. సీఎం రేవంత్ స్పెషల్ ట్వీట్‌!

Telangana Formation Day: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఎందరో మహానుభావుల త్యాగాలు, ఉద్యమ స్ఫూర్తి ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని పేర్కొంటూ అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షలను సాకారం చేసుకుని తెలంగాణ అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని పేర్కొన్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణను సమగ్ర అభివృద్ధి, సామాజిక న్యాయం, ఆర్థిక పురోగతి దిశగా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని చెప్పారు.

- Advertisement -

పునర్నిర్మాణంలో భాగస్వాములు కండి: రైతుల సంక్షేమం, మహిళల సాధికారత, యువతకు ఉపాధి అవకాశాలు, విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పారదర్శక, జవాబుదారీతనంతో కూడిన పాలనను అందిస్తుందని పేర్కొన్నారు. ప్రతి కుటుంబానికి అభివృద్ధి ఫలాలు చేరేలా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వేడుక సందర్భంగా రాష్ట్ర ప్రజలందరూ ఐక్యంగా, సౌభ్రాతృత్వంతో ముందుకు సాగుతూ.. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.

Also Read-Telangana: త్యాగాల పురిటిగడ్డ.. నేటి స్వేచ్ఛా తెలంగాణ!

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News