Extends age limit: ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యుస్ అందించింది. ఉద్యోగ నియామకాలకు సంబంధించి గరిష్ట వయోపరిమితిని సడలిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఉన్న గరిష్ట వయోపరిమితిని 34 ఏళ్ల నుండి ఏకంగా 44 ఏళ్లకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఏడాది పాటు సడలింపు అమలు: ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో జనరల్ కేటగిరీ (OC) అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి 44 ఏళ్లకు పెరిగింది. రిజర్వేషన్లు ఉన్న అభ్యర్థులకు (బీసీ, ఎస్టీ, ఎస్సీ, ఈడబ్ల్యూఎస్) నిబంధనల ప్రకారం దీనికి అదనంగా మరికొంత సడలింపు లభించనుంది. ఈ వయోపరిమితి సడలింపు ఏడాది పాటు అమలులో ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. ఈ కాలంలో వచ్చే అన్ని ఉద్యోగ నోటిఫికేషన్లకు ఈ కొత్త నిబంధన వర్తిస్తుంది.
Also read-Owaisi: పరీక్షలు వాయిదా వేయండి.. సీఎంను కోరిన అసదుద్దీన్ ఓవైసీ
నిరుద్యోగుల్లో హర్షాతిరేకాలు: గత కొన్నేళ్లుగా సరైన నోటిఫికేషన్లు రాక.. వయోపరిమితి దాటిపోయి ఆందోళనలో ఉన్న లక్షలాది మంది నిరుద్యోగులకు ఈ నిర్ణయం పెద్ద ఊరటనిచ్చింది. ఈ సడలింపుతో తమకు ప్రభుత్వ ఉద్యోగం సాధించేందుకు మరో సువర్ణావకాశం లభించిందని అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

