HomeTop StoriesTelangana: నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్‌.. 50 వేల ఉద్యోగాల భర్తీకి సిద్ధమవుతున్న రేవంత్‌ సర్కార్‌!

Telangana: నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్‌.. 50 వేల ఉద్యోగాల భర్తీకి సిద్ధమవుతున్న రేవంత్‌ సర్కార్‌!

Telangana: తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు తీపి కబురు అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. వివిధ ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న దాదాపు 50 వేల ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర మంత్రివర్గం (Cabinet) ఆమోదం తెలపనుంది. ముఖ్యమంత్రి అధ్యక్షతన శనివారం సాయంత్రం 4:00 గంటలకు సచివాలయంలో జరగనున్న కేబినెట్ భేటీలో ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఆయా విభాగాల నుంచి వచ్చిన ప్రతిపాదనలను పరిశీలించిన ఆర్థిక శాఖ.. భర్తీ ప్రక్రియకు సంబంధించిన పూర్తి నివేదికను కేబినెట్ ముందు ఉంచనుంది. ఏయే శాఖల్లో ఎన్ని పోస్టులు భర్తీ చేయాలనే దానిపై ఈ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు.

- Advertisement -

శాఖల వారీగా ఖాళీల వివరాలు: రాష్ట్ర అవసరాలు, ప్రాధాన్యతలను బట్టి పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. సచివాలయ వర్గాల సమాచారం ప్రకారం ప్రాథమికంగా 50 వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు రేవంత్‌ సర్కార్‌ సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. రాష్ట్రంలో సాధారణ కానిస్టేబుల్ నుంచి ఎస్ఐ ర్యాంక్ వరకు దాదాపు 19 వేల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు డీజీపీ గుర్తించగా.. అందులో మొదటి విడతగా 13 వేల పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం తెలపనున్నట్లు సమాచారం.

Also read-Yadagirigutta: సీఎం పర్యటనలో ప్రోటోకాల్ లోపం.. 15 నిమిషాలు చాపర్‌లోనే వేచి ఉన్న రేవంత్‌ రెడ్డి

నేటి కేబినెట్ సమావేశంలో ఆమోదం?: వీటితో పాటుగా ఆర్టీసీలో మూడు వేల పోస్టులు, అగ్నిమాపక శాఖలో 700 పోస్టులు, అటవీశాఖలో బీట్ కానిస్టేబుళ్లుగా 1100 పోస్టుల చొప్పున ఉన్నట్లు సచివాలయ వర్గాలు పేర్కొన్నాయి. వీటికి తోడు వివిధ విశ్వవిద్యాలయాల్లో దాదాపు 20 వేల అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీ చేయనున్నారు. గత క్యాబినెట్ సమావేశంలో చర్చకు వచ్చిన ప్రతిపాదనలపై నిర్ణయం తీసుకోకుండా పెండింగ్‌లో ఉన్న కొన్నింటికి సైతం నేటి మంత్రి వర్గ సమావేశంలో ఆమోదం లభించనున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News