HomeTop StoriesSrisailam: శ్రీశైల మల్లికార్జునుడిని దర్శించుకున్న తెలంగాణ గవర్నర్

Srisailam: శ్రీశైల మల్లికార్జునుడిని దర్శించుకున్న తెలంగాణ గవర్నర్

Governor Shiv Pratap Shukla: తెలంగాణ గవర్నర్ శివ్‌ ప్రతాప్‌ శుక్లా దంపతులు శనివారం ఉదయం శ్రీశైల క్షేత్రాన్ని దర్శించుకున్నారు. మల్లికార్జున స్వామి, భ్రమరాంబికా అమ్మవార్ల సేవలో పాల్గొని ప్రత్యేక మొక్కులు చెల్లించుకున్నారు.

- Advertisement -

ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం: తెల్లవారుజామున క్షేత్రానికి చేరుకున్న గవర్నర్ దంపతులకు ఆలయ మహాద్వారం వద్ద శ్రీశైలం దేవస్థానం ఈవో మరియు అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ఆలయ మర్యాదలతో వారిని దర్శనానికి తీసుకెళ్లారు. గవర్నర్ దంపతులు మల్లికార్జున స్వామివారి గర్భాలయంలో భక్తిశ్రద్ధలతో రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం భ్రమరాంబికా అమ్మవారి సన్నిధిలో జరిగిన కుంకుమార్చన పూజలో పాల్గొన్నారు.

Also read-CM Revanth Reddy: ‘మూసీ ప్రక్షాళన చేయకపోతే నల్గొండ ప్రజలకు తీవ్ర నష్టం’

తీర్థప్రసాదాల వితరణ: దర్శనం అనంతరం ఆలయ అధికారులు గవర్నర్ దంపతులను శేషవస్త్రంతో ఘనంగా సత్కరించారు. స్వామి, అమ్మవార్ల తీర్థప్రసాదాలను అందజేశారు. ఆలయ జ్ఞాపికను బహుకరించారు. గవర్నర్ పర్యటన దృష్ట్యా పోలీసులు ఆలయ పరిసరాల్లో పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News