Intermediate Results: తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యార్థుల నిరీక్షణ ముగిసింది. 2026 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను బోర్డు అధికారులు కొద్దిసేపటి క్రితమే విడుదల చేశారు. ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు అధికారికంగా ఈ రిజల్ట్స్‌ను ప్రకటించారు.
ఉత్తీర్ణత శాతం వివరాలు: ఈ ఏడాది మొత్తం 9.97 లక్షల మందికి పైగా విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా.. ఫలితాల్లో గత ఏడాది కంటే మెరుగైన ప్రదర్శన నమోదైంది.ప్రథమ సంవత్సరం (1st Year)లో 66.2 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ద్వితీయ సంవత్సరం (2nd Year)లో 70.58 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఎప్పటిలాగే ఈసారి కూడా ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించినట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. ఉత్తీర్ణులైన విద్యార్థులకు విద్యాశాఖ అధికారులు అభినందనలు తెలిపారు. మార్కులు తక్కువ వచ్చిన విద్యార్థులు ఆందోళన చెందవద్దని అన్నారు. సప్లిమెంటరీ పరీక్షల్లో విజయం సాధించాలని కోరుతున్నట్లుగా తెలిపారు.
ఫలితాలు ఇలా చూసుకోండి: విద్యార్థులు తమ మార్కుల మెమోలను అధికారిక వెబ్‌సైట్ www.tgbie.cgg.gov.in ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అలాగే ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన వాట్సాప్ నంబర్ 8096958096 కు ‘bie’ అని మెసేజ్ పంపడం ద్వారా కూడా క్షణాల్లో ఫలితాలను పొందవచ్చు.

