HomeTop StoriesTelangana: ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవ కార్యక్రమం..హాజరైన ఉపరాష్ట్రపతి

Telangana: ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవ కార్యక్రమం..హాజరైన ఉపరాష్ట్రపతి

Telangana Liberation Day:సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్ వేదికగా తెలంగాణ విమోచన దినోత్సవ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. తెలంగాణ నిజాం పాలన నుంచి బయటపడి భారత యూనియన్ లో చేరిన చారిత్రక ఘట్టాన్ని గుర్తుచేసుకుంటూ కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలో ఈ అధికారిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకలకు భారత ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

- Advertisement -

కార్యక్రమానికి వచ్చిన ఉపరాష్ట్రపతి ముందుగా వీర సైనిక్ స్మారకం వద్దకు వెళ్లారు. అక్కడ పుష్పగుచ్ఛం ఉంచి దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన అమర జవాన్లకు నివాళి సమర్పించారు. అనంతరం పరేడ్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన ప్రధాన వేదిక వద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వేడుకలను అధికారికంగా ప్రారంభించారు.

జాతీయ జెండా ఆవిష్కరణ తర్వాత కేంద్ర సాయుధ పోలీసు బలగాలు నిర్వహించిన కవాతు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కవాతు సందర్భంగా సాయుధ బలగాల నుంచి ఉపరాష్ట్రపతి గౌరవ వందనం స్వీకరించారు.తెలంగాణ విమోచన ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన వారిని ఈ సందర్భంగా ప్రముఖులు స్మరించుకున్నారు. అప్పటి చారిత్రక పరిణామాలను గుర్తుచేస్తూ దేశ ఐక్యత, సమగ్రత, సార్వభౌమాధికారాన్ని పరిరక్షించాల్సిన బాధ్యతను గుర్తుచేశారు. స్వాతంత్య్రం కోసం, దేశ భద్రత కోసం త్యాగాలు చేసిన వీరుల సేవలను స్మరించుకోవాలని పేర్కొన్నారు.

ఈ అధికారిక వేడుకకు కేంద్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నత స్థాయి అధికారులు హాజరయ్యారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో కార్యక్రమంలో పాల్గొన్నారు.

Also Read:Modi: వారణాసిలో సేవా సంకల్ప్ అభియాన్‌.. పాల్గొంటున్న చంద్రబాబు

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News