HomeTop StoriesTelangana: కొత్త పింఛన్ల పంపిణీకి ముహూర్తం ఫిక్స్ చేసిన టీజీ సర్కార్..

Telangana: కొత్త పింఛన్ల పంపిణీకి ముహూర్తం ఫిక్స్ చేసిన టీజీ సర్కార్..

Telangana New Pensions: తెలంగాణలో కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న వారికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 2.50 లక్షల పింఛన్లు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ఇప్పటికే అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. ఆగస్టు 9న ప్రారంభమైన దరఖాస్తుల ప్రక్రియకు సెప్టెంబర్ 15 వరకు గడువు ఇచ్చారు. దరఖాస్తు చేసిన వారిలో అర్హులను గుర్తించేందుకు అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేపడుతున్నారు.

- Advertisement -

దరఖాస్తుదారుల ఇళ్లకు అధికారులు వెళ్లి కుటుంబ పరిస్థితి, ఆదాయం, ఇతర వివరాలను పరిశీలించనున్నారు. ఈ నెలాఖరులోగా పరిశీలన పూర్తి చేసి, వచ్చే నెల మొదటి వారంలో అర్హుల జాబితాను సిద్ధం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అనంతరం జాబితాను ప్రభుత్వానికి పంపించి ఆమోదం తీసుకోనున్నారు.

అర్హత నిర్ధారణకు అవసరమైన ధ్రువీకరణ పత్రాల విషయంలో కొన్ని వర్గాల వారికి ఇబ్బందులు ఎదురయ్యాయి. దివ్యాంగులు, డయాలసిస్ బాధితులు, ఫైలేరియా బాధితులు, చేనేత కార్మికులు, గీత కార్మికులు, వితంతువులు, ఒంటరి మహిళలకు సంబంధిత పత్రాలు అవసరం. ఒంటరి మహిళలు విడాకుల పత్రాలు, కోర్టు ఉత్తర్వులతో పాటు ఏడాదిగా ఒంటరిగా ఉంటున్నట్లు ధ్రువీకరణ ఇవ్వాలి. వితంతువులు భర్త మరణ ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాలి.

కొన్ని శాఖల నుంచి సర్టిఫికెట్లు పొందడంలో ఆలస్యం కావడంతో పత్రాలు లేకుండానే దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. అయితే పరిశీలన సమయంలో వాటిని సమర్పిస్తేనే అర్హత నిర్ధారిస్తారు. ఇప్పటికే కొత్త పింఛన్ల కోసం బడ్జెట్ కేటాయించడంతో దసరా నుంచి అర్హులకు పింఛన్ సొమ్ము అందించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రస్తుతం 2.50 లక్షల మందినే ఎంపిక చేయనున్నారు.

Also Read:Heavy Rain: బంగాళాఖాతంలో కొనసాగున్న అల్పపీడనం.. వానలే వానలు

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News